Moviesశ్రీలీల‌కు ఎంత ఇస్తారో అంతే నాక్కూడా… ఈ టాలీవుడ్ హీరోయిన్ గొంతెమ్మ...

శ్రీలీల‌కు ఎంత ఇస్తారో అంతే నాక్కూడా… ఈ టాలీవుడ్ హీరోయిన్ గొంతెమ్మ కోర్కెలు…!


ఆమె టాలీవుడ్ లో చిన్న హీరోయిన్. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్‌ సినిమాలకు దూసుకు వచ్చింది. చేసిన క్యారెక్టర్ కు అలా ఫిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అసలు ఆ సినిమా ఎందుకు ? అంత పెద్ద హిట్ అయింది అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సినిమా హిట్ అవ్వటం వెనక ఏ ఏ సీన్లు బాగా క్లిక్ అయ్యాయి అన్నది అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ బుడ్డ హీరోయిన్ కు రెండుమూడు ఆఫర్లు లైన్లో ఉన్నాయి. దీంతో ఆమె క్రేజీ హీరోయిన్ శ్రీలీల తర్వాత నేనే.. నాకు కూడా ఆమె రేంజ్ లో రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తూ ఉందట. అసలు అన్ని తరహా పాత్రలకు సెట్ కావాలి.. డ్యాన్సులు, పాటలు, డైలాగులు చెప్పటం.. ఎక్స్ప్రెషన్లు ఇవ్వ‌డం ఇలా చాలా కావాలి హీరోయిన్ కు..! కానీ ఆమెలో అవి ఏమాత్రం లేవు.

ఏదో ఆ క్యారెక్టర్ అలా సెట్ అయ్యి ఆ సినిమా హిట్ అయింది. ఇవన్నీ వదిలేసి నాకు శ్రీలీల రేంజ్ రెమ్యున‌షన్ కావాలి అని డిమాండ్ చేయటం ఏంటని ? టాలీవుడ్ జనాలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆమెతో రెండు మూడు సినిమాలు తీసేందుకు సిద్ధపడుతున్న నిర్మాతలు కూడా ఆమెకి శ్రీలీలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది.. ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వటం చాలా ఎక్కువ..! అప్పుడే అంత ఓవర్ చేస్తే ఆమె కింద పడటం ఖాయం అని చెవులు కొరుక్కుంటున్నార‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news