సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో హిట్ కొట్టారు. రజనీకాంత్ పని అయిపోయింది అని విమర్శలు వస్తున్న సమయంలో జైలర్ సినిమాతో ఏకంగా రు. 600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఈ వయసులోనూ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. రజని తన సహనటి అయిన లతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ దంపతులకు ఐశ్వర్య – సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ సినిమాలోకి రాకముందు బెంగళూరులో ఒక గవర్నమెంట్ బస్ కండక్టర్గా పని చేశారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన బస్ కండక్టర్గా పనిచేసే టైంలో ఓ అమ్మాయి తన బస్సులో రోజు వచ్చి తనని సినిమాలో ట్రై చేయమని చెప్పేదట. అంతేకాకుండా ఆ అమ్మాయి రజనీకాంత్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు ఇచ్చాయి.
అలాగే ఆయనకు సినిమాలపై ఉన్న ఇష్టం తెలిసి.. సినిమాల్లోకి వెళ్తే స్టార్ హీరో అవుతావని ప్రోత్సహించి ఇండస్ట్రీకి పంపిందట. ఆ టైంలో రజనీ దగ్గర డబ్బులు లేకపోతే ఆమెనే డబ్బులు కూడా ఇచ్చి పంపింది. అయితే రజనీకాంత్ స్టార్ హీరో అయ్యాక ఆమెని కలవడానికి పోతే ఆ అమ్మాయి ఆచూకీ తెలియలేదట. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో ఓ అమ్మాయిని చూడడానికి రజిని వెళ్లారట.
ఆ అమ్మాయి రజినీకాంత్ ను చూసి ఈయనేంటి అచ్చం దొంగలే ఉన్నాడు.. అలాగే చాలా నల్లగా కూడా ఉన్నాడు.. నాకు ఇష్టం లేదు అని రజనీని రిజెక్ట్ చేసిందట. అలా పెళ్లి చూపుల్లో అవమానించినందుకు తలైవా ఎంతో బాధపడ్డారట. ఆ తర్వాత సహనటి లతతో ప్రేమలో పడటం.. ఆమెను పెళ్లాడటం జరిగిపోయాయి. లత రజనీ భార్య అయ్యాక రజనీకాంత్ కు అదృష్టం మరింతగా పట్టిందని చెప్పాలి. అక్కడ నుంచి తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు.