జాతిరత్నాలు సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్ అందుకున్న కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి.. ఈ సినిమా తర్వాత నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది. మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అనుష్క అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 7న మిస్‌శెట్టి సినిమా ధియేటర్లలో రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ సిటీ బ్యూటీ అనుష్క మూడేళ్ల తర్వాత వెండి తెరపై కనిపిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం.
తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందని.. ఈ విషయాన్ని తన ఇన్స్టాల్ లో షేర్ చేశారు.
మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మెగాస్టార్ అందరికంటే ముందుగా రివ్యూ ఇచ్చేశారు. అలాగే హీరో నవీన్ పోలిశెట్టితో పాటు హీరోయిన్ అనుష్క అద్భుతంగా నటించారు అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు తెలిపారు. మరోసారి అభిమానులతో కలిసి థియేటర్లో చూడాలన్న కోరిక కలిగింది అంటూ పోస్ట్ చేశారు.
ఇది చూసిన మెగా అభిమానులు సైతం ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. చిరు స్వయంగా సినిమా బాగుందని చెప్పడంతో ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుండడంతో పాటు సినిమాకు కాస్త హెల్ఫ్ కానుంది.