Moviesతెలుగులో రెండో సినిమాకి సైన్ చేసిన జాన్వీ.. చరణ్ ని పక్కకి...

తెలుగులో రెండో సినిమాకి సైన్ చేసిన జాన్వీ.. చరణ్ ని పక్కకి నెట్టేసి మరి ఆ యంగ్ హీరోతో రొమాన్స్ కి సై..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తెలుగులో డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే . జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది . అయితే అప్పుడే జాన్వీ కపూర్ తెలుగులో తన రెండో సినిమాను సైతం సైన్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడు చరణ్ . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరిగింది . అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి జాన్వి తప్పకున్నట్లు తెలుస్తుంది.

ఆ ప్లేస్ లో మరో యంగ్ హీరో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్పిస్తే తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అలాంటి అఖిల్ కు యువీ క్రియేషన్స్ ఎలాగైనా ఈసారి హిట్ ఇవ్వాలని తెగ తాపత్రయపడుతుంది . ఈ క్రమంలోనే జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్ .అంతేకాదు యంగ్ హీరో కావడం పైగా నాగార్జున కొడుకు కావడంతో జాన్వి సినిమాను ఓకే చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news