ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసుకునే నరేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం చేస్తున్నప్పటి నుంచి ఆయన పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది. వీళ్ళ ప్రేమ యవ్వారం అందరికీ తెలిసిన విషయమే .
ఇది ఓ తెరిచిన పుస్తకం . అయితే రీసెంట్గా ఈ జంట ప్రముఖ ఛానల్లో ఓ ఈవెంట్ కు హాజరైంది. కాగా ఆ ఈవెంట్ లో యంగ్ కపుల్స్ లా తెగ సందడి చేసిన నరేష్ పవిత్రలు ..సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు . అంతేకాదు రీసెంట్ గా ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో పవిత్ర నరేష్ చాలా ప్రేమగా కనిపించారు. అంతేకాదు పవిత్ర నరేష్ ని ముద్దుగా ఏమని పిలుస్తారు .. అనే విషయాని నిర్వాహకులు బయటపెట్తించారు.
ఆమె మాట్లాడుతూ..” నేను నరేష్ ముద్దుగా రాయ అని పిలుస్తాను “అంటూ చెప్పుకొచ్చింది. గతంలో మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ నేను పవిత్రాన్ని “అమ్ములు” అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు కొందరు వీళ్లది రియల్ లవ్ అని కానీ కొంచెం లేటుగా పుట్టిందని కొందరు జనాలు చెప్పుకొస్తుంటే మరి కొంత మంది మాత్రం ఇది కేవలం మోజు అని అది తీరిపోగానే మళ్లీ కధ మొదటికి వస్తుందని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నరేష్ పవిత్రల ప్రోమో వైరల్ గా మారింది..!!