Moviesవాట్.."ఖుషి" లో చూపించిన ఆ దోషం నిజమే.. అందుకే చై-సామ్ విడిపోయారా..?

వాట్..”ఖుషి” లో చూపించిన ఆ దోషం నిజమే.. అందుకే చై-సామ్ విడిపోయారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1 గ్రాండ్గా థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. అంతే కాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 70 కోట్లు క్రాస్ చేసేసి చరిత్ర సృష్టించింది . త్వరలోనే ఈ సినిమా 100 కోట్లు కూడా క్రాస్ చేస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు .

కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ఇప్పుడు హైలైట్ గా మారాయి . నిజానికి సినిమాలో విప్లవ్ – ఆరాధ్య జాతకాలలో నాడీ దోషం ఉంటుంది. ఆ కారణంగానే వాళ్ళకి పిల్లలు పుట్టారని వాళ్ళ సంసార జీవితం సాఫీగా సాగలేదని ఆరాధ్య తండ్రి చెప్పుకొస్తాడు . అయితే మొదటి నుంచి జాతకాలు నమ్మని విప్లవ్ తండ్రి ఆ విషయాన్ని లైట్గా తీసుకుంటాడు. అయితే ఇది మొత్తం ఏదో స్క్రిప్ట్ కాదని నిజంగానే సమంత జాతకంలో ఉన్న విషయాన్ని ఓపెన్ గా శివనిర్వాణ తెర పై ఇలా చూపించాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య సమంత జాతకంలో కూడా ఇదే దోషం ఉందని.. మొదటి నుంచి నాగార్జున ఇలాంటి దోషాలను జాతకాలను పెద్దగా పట్టించుకోడని ..ఆయన తండ్రి గౌరవాలకు విలువిస్తూ సమంత చెప్పిన పూజను నాగ చైతన్య చేయను అంటూ మొండి చేశాడని.. ఆ కారణంగానే వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదని.. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి విభేదాలు కారణంగా విడాకుల వరకు వెళ్లారని ..ఇదే ఖుషి సినిమాలో చూపించారని..ఆ సీన్స్ సమంత రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన రియల్ సీన్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news