Movies20 ఏళ్ల తరువాత మళ్ళీ అలాంటి పని చేస్తున్న స్నేహ.. అదృష్టం...

20 ఏళ్ల తరువాత మళ్ళీ అలాంటి పని చేస్తున్న స్నేహ.. అదృష్టం అంటే ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ ని గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారు అభిమానులు . అలాంటి హీరోయిన్స్ లో ఒకరే స్నేహ . అందాల ముద్దుగుమ్మ.. ట్రెడిషనల్ బ్యూటీ ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే.. సినిమా ఇండస్ట్రీలో చిట్టి పొట్టి బట్టలు వేసుకొని గబ్బు పనులు చేస్తూ ఆఫర్ సంపాదిస్తున్న హీరోయిన్స్ ఉన్న నేటి సినిమా ఇండస్ట్రీలో సైతం పద్ధతి గా రోల్స్ చేసి కేవలం టాలెంట్ నటనతోనే అవకాశాలు అందుకున్న ట్రెడిషనల్ బ్యూటీ అని చెప్పాలి .

కాగా పెళ్లి తర్వాత పద్ధతిగా రోల్స్ నటిస్తున్న స్నేహ ఈ మధ్యకాలంలో తెరపై తన తక్కువగా కనిపిస్తుంది . అయితే రీసెంట్గా స్నేహకు జాక్పాట్ ఆఫర్ వచ్చింది. ఇదే విషయం ఇపూడు వైరల్ గా మారింది . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా లియో . ప్రస్తుతం నిర్మానంతరం కార్యక్రమాలను జరుపుకుంటుంది ఈ సినిమా. కాగా ఆయన తన తదుపరి 68వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు . వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది .

ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా ద్వీపాత్ర అభినయం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో కొడుకు పాత్రకు జంటగా నటి ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా తండ్రిగా నటించిన విజయ్ సరసన హీరోయిన్గా స్నేహ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రకు ముందుగా జ్యోతికను – సిమ్రాన్ అనుకున్నారట కానీ అందరికన్నా స్నేహ ఈరోల్ కి బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావించి ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చారట . 20 ఏళ్ల క్రితం విజయ్ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించి మెప్పించారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో నటించబోతున్నారు. దీంతో గోల్డెన్ ఆఫర్ అందుకుంది స్నేహ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news