Moviesసైలెంట్ గా పెళ్లి చేసుకున్న మహేశ్ విట్టా.. అమ్మాయి ఎవరో తెలిస్తే...

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న మహేశ్ విట్టా.. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే..!!

బిగ్బాస్ ద్వారా పాపులారిటి సంపాదించుకున్న వారిలో చాలామంది ఉన్నారు . ఆ లిస్టులోకి వస్తాడు కమెడియన్ బిగ్బాస్ ఫేమ్ మహేష్ విట్టా. ఈ పేరు అందరికీ సుపరిచితమే . టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగి.. ఒక్కొక్క స్థాయికి చేరిన మహేష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మనం చూసాం. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ విట్టా తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడి సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరాడు .

బిగ్ బాస్ 3 ద్వారా తనలోని టాలెంట్ ను బయటపెట్టిన మహేష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి శ్రావణి రెడ్డిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వారిద్దరి వివాహం చాలా ఘనంగా జరిగింది . వీళ్ళకి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్ విట్టా.

బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన లవ్ స్టోరీ ని చెప్పాడు మహేశ్ కానీ ఏమాత్రం అమ్మాయి పేరు బయట పెట్టలేదు . కాగా ఇన్నాళ్ల తర్వాత మహేష్ విట్టా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. ఇదే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ జంటకు ఫ్యాన్స్ నుంచి స్పెషల్ విషెస్ అందుతునాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news