Movies"గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవ్వడు కొట్టలేరు".. "బేబీ" ఎక్కడ...

“గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవ్వడు కొట్టలేరు”.. “బేబీ” ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టిందిగా..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. ఎక్కడ చూసినా హీరోయిన్ సమంత.. హీరో విజయ్ దేవరకొండ పేర్లే మారు మ్రోగి పోతున్నాయి . దానికి కారణం రీసెంట్గా వాళ్ళు నటించిన ఖుషి సినిమా విడుదల కావడమే . శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది . కాగా సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా సరే ..జనాభా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. మరి ముఖ్యంగా తెరపై విజయ్ – సమంత ల రొమాన్స్ బాగా ఆకట్టుకునింది . ఎంతలా అంటే ఈ సినిమా ఏకంగా 70 కోట్లు క్రాస్ చేసేసింది .

దీంతో బాక్సాఫీస్ వద్ద ఖుషి సినిమా బిగ్గెస్ట్ విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమాలో సమంత – విజయ్ దేవరకొండ తో బెడ్ సీన్స్ – లిప్ లాక్ సీన్స్ – బోల్డ్ సీన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో సమంత వైవాహిక జీవితాన్ని ఇందులోకి లాగుతూ కొందరు ఫన్నీ మీమ్‌స్తో ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గతంలో శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజిలీలో నాగచైతన్య – సమంత కలిసిన నటించిన ఒక్క లిప్ లాక్ సీన్ రొమాంటిక్ సీన్ ఏమి డిజైన్ చేయలేదు కానీ ..అదే శివ నిర్వాణ ఇప్పుడు సమంత – విజయ్ ల మధ్య మాత్రం టూ బోల్డ్ గా రాసుకోచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ సీన్స్ లో సమంత కావాలనే నటించిందని.. తనను మిస్ చేసుకున్నందుకు నాగచైతన్యకు తిక్క కుదరాల్సిందే అన్న రేంజ్ లో ఈ సినిమాలో రొమాన్స్ చేసిందని ..ఆ సీన్స్ చూస్తేనే అర్థమయిపోతుందని మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ సినిమాల్లోని సూపర్ హాట్ డైలాగ్ ని సమంత – విజయ రొమాన్స్ కి మ్యాచ్ చేస్తూ “గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఎవడు కొట్టలేడు” అనే లైన్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు సమంత నాగచైతన్యను కూసింత గట్టిగానే కొట్టింది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో గతంలో సమంత నాగచైతన్య లిప్ కిస్ ఫోటోను ఇప్పుడు ఖుషి సినిమాలో విజయ్ సమంత లిప్ కిస్ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి ఒక్క లిప్ కిస్ తో సమంత మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news