Moviesబాల‌య్య ' బాబాయ్ అబ్బాయ్ ' సినిమాకు ' భ‌గవంత్ కేస‌రి...

బాల‌య్య ‘ బాబాయ్ అబ్బాయ్ ‘ సినిమాకు ‘ భ‌గవంత్ కేస‌రి ‘ కి ఉన్న లింక్ ఇదే..!

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ ప‌వ‌ర్‌ చూపించబోతున్నాడట. ప్రస్తుతం అనిల్ బాలయ్యతో భగవంత్ కేస‌రి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ జాన‌ర్‌ల్లో నడిచే కథ‌ అయినా కామెడీ మాత్రం చాలా హిలేరియస్ గా ఉంటుందట. బాలయ్య కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుందట.

బాల‌య్య అప్పుడెప్పుడో న‌టించిన‌ బాబాయ్ అబ్బాయి సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ ఆరెంజ్ కామెడీ సినిమా చేయలేదు. ఇన్నేళ్ల త‌న కెరీర్‌లో ఎక్కువగా సీరియస్, యాక్షన్ రోల్స్ చేస్తున్నాడు. అయితే బాలయ్య వెండితెరపై జోవియ‌ల్‌గా కనిపించి చాలా రోజులు అయింది. ఈ క్రమంలోనే బాలయ్య తన పాత్ర దృష్ట్యా భగవంత్ కేస‌రి సినిమాపై చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు.. యాక్టివిటీస్ అన్ని చాలా సరదా సరదాగా సాగుతాయట. ఈ సీజన్ సినిమాలో తండ్రి, కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా అనీల్ రావిపూడి – బాలయ్య కలయికలో సినిమా అనగానే ట్రేడ్ వర్గాలతో పాటు సగటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. బాలయ్యను ఢీకొట్టే విల‌న్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. దసరా కానుక‌గా అక్టోబర్ 19న భగవంత్‌ కేసరి థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news