టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మూడున్నర పదుల వయసులో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన తమన్నా రజినీకాంత్ జైలర్ – చిరంజీవి భోళా శంకర్ సినిమాలలో కూడా నటించింది. ఇక బాలీవుడ్ నటుడు విజయవర్మతో తమన్న ప్రేమలో ఉన్నానని కొద్ది రోజుల క్రితం ఓపెన్ గానే చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
తమన్నా ఆమె ప్రియుడు విజయ వర్మ ఇద్దరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి విదేశాలకు వెళుతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు చూస్తే ప్రియుడు విజయవర్మతో ఆమెకు బ్రేకప్ అయ్యిందా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు.. కానీ మన అనుకునే వ్యక్తుల దగ్గర నుంచి అలాంటి మాటలు వింటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది చెప్పింది.
కానీ చివరికి నీ గురించి నువ్వు ఏం చెప్పుకుంటున్నావో ? అదే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా చేసిన కామెంట్లు చూస్తోన్న నెటిజన్లు అసలు ఆమె ఎవరిని ? ఉద్దేశించి ఇలా మాట్లాడింది.. ఇంత వేదాంత ధోరణితో మాట్లాడటం వెనుక ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా ? విజయవర్మతో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.