Moviesబాల‌కృష్ణ‌తో బంధుత్వం క‌లిపిన శ్రీలీల‌… ఆ వరుస‌తో పిలిచేసిందిగా…!

బాల‌కృష్ణ‌తో బంధుత్వం క‌లిపిన శ్రీలీల‌… ఆ వరుస‌తో పిలిచేసిందిగా…!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత రవితేజ ధమాకా కూడా సూపర్ హిట్ అవడంతో ఆమెకు వ‌రుస‌ ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రస్తుతం ఆమె సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్‌ కేసరిలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీలా బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ సార్ బయట వేరు కెమెరా ముందుకు వస్తే వేరు.. ఒక్కసారి పాత్రలోకి ఎంటర్ అయ్యారంటే ఇక ఆయన భగవంత్‌ కేసరే.. బాలకృష్ణ కాదు అనేంతగా పాత్రలో లేనమవుతారని చెప్పింది.

ఇందులో మా పాత్రల గురించి రివిల్ చేయటం నాకు ఇష్టం లేదు.. అయితే ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన నాకు సొంత బాబాయ్ లాగా కనిపించారు అంటూ బాలయ్యతో బంధుత్వం కలిపింది. ఇక బాలయ్య లొకేషన్ లో నన్ను అలాగే చూసుకున్నారు.. మళ్ళీ అవకాశం వస్తే బాలయ్య సార్ తో చేయాలని ఉందని తెలిపింది. ఇక శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news