Moviesఎన్టీఆర్ ' దేవ‌ర ' లో సునామి… అప్పుడే అదిరిపోయే ట్విస్ట్‌..!

ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ లో సునామి… అప్పుడే అదిరిపోయే ట్విస్ట్‌..!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సునామి సీక్వెన్స్ ఉంటాయట. ఈ సునామి విజువల్స్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సునామి సీక్వెన్స్ లో విఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

సముద్రం నేపధ్యాన్ని.. ముఖ్యంగా సముద్రంలోని భయానికి వాతావరణాన్ని కూడా ఈ సునామీ సీక్వెన్స్ లో దర్శకుడు కొరటాల బాగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సునామీ సీక్వెన్స్‌లు ఇంటర్వెల్ బ్యాంగ్‌కు 10 నిమిషాల ముందు వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ విజువ‌ల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ మోత మోగిపోవాల్సిందే అట‌. ఈ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారట.

దేవర సినిమాను రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడా అన్న ఉత్కంఠ అయితే ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ.. దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

జాన్వీకపూర్ కి తెలుగులో ఇంకా చెప్పాలి అంటే సౌత్లో ఆమెకి ఇదే తొలి సినిమా. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news