Moviesనాగ్ నోట సమంత పేరు.. ఇన్నాళ్లకు ప్రేమ పుట్టడానికి కారణం అదేనా..?...

నాగ్ నోట సమంత పేరు.. ఇన్నాళ్లకు ప్రేమ పుట్టడానికి కారణం అదేనా..? ఏం ప్లానింగ్ సామీ..!!

టెలివిజన్ రంగంలోని అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన షో బిగ్బాస్ షో పై ఎంత కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తారో. అంతే పాజిటివ్ వేలో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు . కాగా ఇప్పటికీ తెలుగులో బిగ్ బాస్ 6 సీజన్ ను కంప్లీట్ చేసుకుని ప్రెసెంట్ ఏడవ సీజన్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది . నిన్న సాయంత్రం గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ షో లో పలువురు కంటెస్టెంట్స్ తమదైన స్టైల్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఉత్సాహపరచడానికి రెడీ అయ్యారు.

కాగ ఇలాంటి క్రమంలోనే అన్ బిలీవబుల్ ఇన్సిడెంట్ ఎదురైంది . షో ని హోస్ట్ చేస్తున్న నాగర్జున మాజీ కోడలు సమంత పేరును ప్రస్తావించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖుషి సినిమా హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్ లో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు . అంతేకాదు “ఎక్కడ మీ హీరోయిన్ సమంత..?” అంటూ అడగడం ఆసక్తికరంగా మారింది. దీంతో విజయ్ మాట్లాడుతూ ..”యుఎస్ ప్రీమియర్ సందర్భంగా ప్రమోషన్స్ కి వెళ్లిందని ..మళ్లీ కలిసి ప్రమోట్ చేస్తామని చెప్పుకొచ్చారు “.

అంతేకాదు నాగార్జున మాట్లాడుతూ ..”సమంత చాలా మంచి నటి అని ..అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తుందని అభినందించారు. ఈ క్రమంలోన సామ్ తో నటించడంతో ఎవరి పర్ఫామెన్స్ డామినేట్ చేసేలా ఉందని కూడా విజయ్ ని అడిగారు నాగార్జున . ఇలా ఆయన నోటి నుంచి సమంత పేరు వినడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అయితే నాగార్జున ఇలా మాట్లాడడం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో సమంత ఇష్యూ పై అక్కినేని హీరోలను ఎలా ట్రోల్ చేస్తున్నారో మనకు తెలిసిందే . ఆ ట్రోలింగ్ కారణంగానే అక్కినేని అఖిల్ కు అక్కినేని నాగచైతన్యకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ఇక ఇలా అన్ని పట్టించుకుంటే కష్టమని ..మూవ్ ఆన్ అవ్వాలని సమంత గురించి నాలుగు ముక్కలు మంచి మాటలు చెప్తే ..ఆమెను ఫ్యాన్స్ కచ్చితంగా కూల్ అవుతారని..నాగార్జున భావించారట . అందుకే ఇలా సమంతని పొగిడేసారని జనాల అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు సమంత గురించి నాగార్జున మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news