మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజకు ఇండస్ట్రీలోనూ.. సోషల్ మీడియాలను భారీ పాపులారిటీ ఉంది. ఆమె కెరీర్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో నడుస్తూ ఉంటుంది. ఆమె ముందుగా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా శిరీష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అతడి కోసం ఏకంగా ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయింది. ఒక పాప పుట్టిన వెంటనే విడాకులు తీసుకుంది.
తర్వాత చాలా రోజులపాటు చిరంజీవి ఇంట్లోనే ఉంది. తర్వాత చిరంజీవి యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి శ్రీజకు మరో పెళ్లి చేశారు. వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. అయితే ఇటీవల కూడా వీరిద్దరూ మనస్పర్ధలు నేపథ్యంలో దూరం దూరంగా ఉంటున్నారు. అధికారికంగా విడాకులు రాలేదు కానీ త్వరలో వీరు విడాకులపై ప్రకటన రానుందని సమాచారం. దీనిపై ఎవరు ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు.
శ్రీజ మాత్రం కళ్యాణ్ కు దూరంగా తన కూతుర్లతో కలిసి ఉంటుంది. ఇక శ్రీజ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా శ్రీజ తన ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. సంథింగ్ ఇస్ కమింగ్ అంటూ రాసుకుంది. అయితే ఈ పోస్ట్ అందరిలోనూ అనుమానాలు పుట్టిస్తుంది.
శ్రీజ కొత్తగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు ఈ పోస్టుల కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరును కూడా ట్యాగ్ చేసింది. మొత్తానికి అయితే శ్రీజ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీజ చెప్పే ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్‌పై అందరిలోనూ సర్వత్ర ఆసక్తి నెలకొంది.