Moviesబిగ్ బ్రేకింగ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘సలార్’ సినిమా వాయిదా?..కొంప...

బిగ్ బ్రేకింగ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘సలార్’ సినిమా వాయిదా?..కొంప ముంచేసిన మేకర్స్ తొందరపాటు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా సలార్. కే జి ఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా కేజిఎఫ్ లాగే రెండు పార్ట్ లు గా తెరకెక్కబోతుంది. అంతేకాదు సలార్ పార్ట్ వన్ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నామంటూ మేకర్స్ ప్రకటించారు . ఈ క్రమంలోనే దానికి తగ్గ రేంజ్ లోనే షూట్స్ సైతం చక చక ఫినిష్ చేశారు .

కాగా ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది అనుకున్న టైంలో ప్రభాస్ కాళ్లకి సర్జరీ జరిగింది . ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అంతేకాదు డాక్టర్ సజెషన్స్ మేరకు ప్రభాస్ నెల రోజులపాటు బెడ్ పైనుంచి దిగకూడదు అంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట. ఈ క్రమంలోనే సలార్ సినిమా షూటింగ్ ఇంకా ఒక పాట రెండు ఇంపార్టెంట్ సీన్స్ మిగిలిపోయి ఉన్నాయి అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఇక చేసేది ఏమీ లేక సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

డిస్టిబ్యూటర్స్ కూడా అనఫిషియల్ గా ఈ న్యూస్ ని కన్ఫామ్ చేసేస్తున్నారట . రిలీజ్ డేట్ ఇంకా ఏది ఫిక్స్ చేయలేదని ప్రభాస్ ఆరోగ్యం కుదుట పడడిన తర్వాతే మిగతా షూట్ ను కంప్లీట్ చేసి అప్పుడు కొత్త డేటు రిలీజ్ చేస్తారు మేకర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో మేకర్స్ తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది . ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా వాయిదా పడిపోతుంది అని తెలియడంతో ఫాన్స్ కూడా డీలా పడిపోయారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో మేకర్స్ స్పందిస్తే కానీ తెలియదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news