ఒక్క సినిమా సరైనది పడితే చాలు హీరో అయినా… హీరోయిన్ అయినా రేంజ్ మారిపోతుంది.. అమౌంట్ పెరిగిపోతుంది.. ఇక కుర్ర హీరోలు, కుర్ర హీరోయిన్లు సరైన హిట్టు పడితే నేల విడిచి సాము చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అణిగి మణిగి ఉంటారు. నూటికి 90 శాతం మంది కుర్ర హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్టు వస్తే చాలు రేంజ్ పెంచేస్తూ ఉంటారు. పారితోషకంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేస్తుంది.
పారితోషకం పెంచుకున్న… ఎక్కువ సినిమాలు చేసినా.. మంచి కథలు పెంచుకున్న పరవాలేదు.. కానీ నేను సూపర్ నా రేంజ్ వేరు అనే భావన మాత్రం రాకూడదు.. అలా వస్తే నిర్మాతలకు కష్టం అవుతుంది. వారి కేరీర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఇటీవల ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అయింది. అంతే ఆ హీరోయిన్ కు మంచి పేరు వచ్చింది.. ప్రశంసలు వచ్చాయి.. దాంతో పాటు ఆటిట్యూడ్ కూడా బాగా పెరిగిపోయింది అన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ సినిమాకు ఆటిట్యూడ్ చూపిస్తే పర్వాలేదు.. ఆ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే ఆ హీరోయిన్ లో బాగా ఓవరాక్షన్ పెరిగిపోయిందని.. ఆ సినిమా ప్రమోషన్లకు కూడా బాగా లేటుగా రావడం.. తర్వాత సినిమాలకు రెమ్యునరేషన్లు పెంచేసి రకరకాల కండిషన్లు పెట్టడం కూడా ప్రారంభమైందట. ఇక తాజాగా హిట్ అయిన సినిమా కూడా తన వల్లే ఆడిందని ఎంత గొప్పగా మాట్లాడుతుందట.
ఇవన్నీ కలిసి ఆమెలో బాగా మార్పు తెచ్చాయని అంటున్నారు. ఆ కుర్ర హీరోయిన్ ప్రవర్తన మార్చుకుంటే మంచిది లేకపోతే ఆమె కెరియర్ కు ఇది ఇబ్బంది అవుతుందని అంటున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత చాలా ఉంది.. కాస్త మంచి హీరోయిన్ దొరికితే 15 – 20 సినిమాలు వరకు ఢోకా ఉండదు కానీ.. సదరు హీరోయిన్ అప్పుడే ఆటిట్యూడ్ చూపిస్తూ ఉండడంతో ఇది ఆమె కెరీర్ కు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.