వేణు తొట్టెంపూడి హీరోగా పరిచయం అయిన స్వయంవరం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది విజయవాడ అమ్మాయి లయ. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో చాలా యేళ్ల పాటు హీరోయిన్ గా కొనసాగినా స్టార్ హీరోయిన్ రేంజ్ కు అయితే ఎదగలేదు.
తెలుగు అమ్మాయి కావడంతో సాంప్రదాయ బద్ధమైన పాత్రలకే పరిమితం కావడంతో స్టార్ హీరోల సినిమాలలో ఆమెకు ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత ఓ ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన లయ చాలా ఏళ్ల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. ఇప్పుడు యువ నటుడు నితిన్ హీరోగా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో కూడున ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనన్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకుడుగా పవన్ కళ్యాణ్ హిట్ మూవీ తమ్ముడు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో లయ నితిన్ కు అక్కగా కనిపించబోతుందని.. ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకం అని అంటున్నారు. ఈ సినిమాలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తుండగా శుక్రవారం నుంచి షూటింగ్ జరుపుకోనుంది.