Moviesప్రియాంక‌చోప్రా బాడీ క‌ల‌ర్‌పై దారుణ‌కామెంట్లు చేసిన స్టార్ హీరో…!

ప్రియాంక‌చోప్రా బాడీ క‌ల‌ర్‌పై దారుణ‌కామెంట్లు చేసిన స్టార్ హీరో…!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. సినిమాలపరంగా ఆమె కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే కెరీర్ పరంగా ఆమె ఎప్పుడూ ఏదో ఒక విమర్శల‌లో చిక్కుకుంటూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో ప్రేమలో పడ్డారన్న ప్రచారంతో వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరూ కలిసి సీక్రెట్ గా డేటింగ్ కూడా చేశారని అంటారు.

ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నప్పుడు కూడా రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక వయసులో తనకంటే చాలా చిన్నవాడు అయిన‌ నిక్ ను పెళ్లి చేసుకోవడం రకరకాల విమర్శలకు తావిచ్చింది. ప్రియాంక – నిక్ ఇద్దరూ కూడా అక్క, తమ్ముళ్లలా ఉంటారు అన్న విమర్శలు ఘోరంగా వచ్చాయి. తాజాగా ప్రియాంక చోప్రా బాడీ కలర్ ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఒక స్టార్ నటుడు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారాయి.

పాకిస్తాన్ కు చెందిన స్టార్ నటుడు మొమ్మార్‌ రానా తాజా సమావేశంలో మాట్లాడుతూ ఓ విలేక‌రి వేసిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఇండియాలో తాను ప్రియాంక చోప్రాను చూసి భయపడ్డాను అని చెప్పాడు. ప్రియాంక అంటే నాకు చాలా అభిమానం… ఆమె నటనకు ఫిదా అయ్యాను.. ఆమె మీద మనసు పడ్డాను.. అయితే ఓ ఈవెంట్లో నా పక్క సీట్లో చాలాసేపు కూర్చుని లేచిపోయింది.. ఆ తర్వాత ఆమె ఎవర‌ని తెలుసుకున్నాను.. అప్పుడు ఆమెను ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూసి ఎంతో భయపడ్డాను అని చెప్పాడు.

ఆమెను అలా చూసిన‌ప్పటినుంచి ఆమెపై నాకున్న అభిమానం పోయింది అంటూ కాంట్రవర్సి కామెంట్లు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక చోప్రా అభిమానులు మొమ్మార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన న‌టిని దారుణంగా అవ‌మానించిన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news