Movies' ఖుషి ' ప్ల‌స్‌లు ( + ) .. మైన‌స్‌ల...

‘ ఖుషి ‘ ప్ల‌స్‌లు ( + ) .. మైన‌స్‌ల ( – ) లెక్కలివే… విజ‌య్ – స‌మంత మాయ చేశారా…!

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఈరోజు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నారు. సినిమాలో విజయ్, సమంత నటనకు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. తమ తమ పాత్రలో విజయ్, సమంత జీవించేసారని చెబుతున్నారు.

కామెడీ బాగుందని.. సినిమా రిలీజ్ కి ముందు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా.. స్క్రీన్ మీద కూడా వాటి పిక్చర్ బాగుందని మంచి రిపోర్ట్ లు వస్తున్నాయి. సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ షో ల నుంచి పాజిటివ్ రిపోర్టులు రావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హిట్ కొట్టేసాం రా అబ్బాయిలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక నిన్నుకోరి – మజిలీ వంటి సినిమాలు అందించిన శివ నిర్వాణ ఖుషి సినిమాకు దర్శకత్వం వహించారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవిశంకర్ ఎలమంచిలి ఈ సినిమా నిర్మించారు. సినిమా ఫ‌స్టాఫ్ చూస్తే డీసెంట్ గా ఉంటుంది. విజయ్, సమంత నీట్ పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకోగా మ్యూజిక్ బాగుంది. ఇక సినిమా మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఖుషి స్టోరీ సింపుల్ అని.. కథ నుంచి పెద్దగా ఏమీ ఆశించవద్దని కూడా కొందరు చెబుతున్నారు.

డీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మాత్రమే అని.. సినిమా మేజర్ మైనస్ పాయింట్ రన్ టైం. ర‌న్ టైం చాలా ఎక్కువగా ఉంది. ఏకంగా 165 నిమిషాల సినిమాను కొంతవరకు ట్రిమ్ చేయవచ్చని చెబుతున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news