Moviesటాలీవుడ్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. ఆ ఘనత మన...

టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. ఆ ఘనత మన బాలయ్యదే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా వీరసింహారెడ్డి సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఆయనకు జోడిగా నటిస్తూ ఉండగా శ్రీ లీల ఆయనకు కూతురు పాత్రలో కనిపించబోతుంది .

కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను సైతం రిలీజ్ చేశారు . గణేష్ యాంతం అనే పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాలకు ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా ఈ సాంగ్ రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి డిసైడ్ అయ్యారు.

టాలీవుడ్ హిస్టరీలోని ఫస్ట్ టైం గణేష్ టెంపుల్స్ లో అభిమానులు చేత ఈ సాంగ్ లాంఛ్ చేయించబోతున్నారు, దాని వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సాంగ్ లాంచ్ చేయనున్న దేవాలయాల లిస్ట్ మీకోసం
*శ్రీ సిద్ధి గణపతి దేవాలయం, రామ్ నగర్ MAIN ROAD, అనంతపురం

  • స్వయంబు కాణిపాక వినాయక దేవాలయం, కాణిపాకం, చిత్తూరు జిల్లా
  • శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం అయినివేల్లి, ఈస్ట్ గోదావరి
  • అమరలింగేశ్వర దేవాలయం,అమరావతి
    *శ్రీ శక్తి గణపతి, శంకర్ మాట్, నల్లకుంట, హైదరాబాద్.
  • శ్రీ సంపత్ గణపతి దేవాలయం, వైజాగ్
  • మహాగణపతి దేవాలయం, పెన్నానది పక్కన, ప్రొద్దుటూరు, కడప జిల్లా
  • శ్రీ విగ్నేశ్వర దేవాలయం, సాయిబాబు థియోటర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
  • శ్రీ సిద్ధి గణపతి దేవాలయం, షోలాపూర్, మహారాష్ట్ర
  • శ్రీ విజయ గణపతి దేవాలయం, RTC కాంప్లెక్స్ రోడ్, శ్రీకాకుళం
  • శ్రీ సాక్షి గణపతి, శ్రీశైలం
  • బాలమూరి గణపతి దేవాలయం, BB రోడ్, చిక్ బల్లపూర్, కర్ణాటక
    *శ్రీ విద్య గణపతి దేవాలయం, కెనరా బ్యాంక్ రోడ్, చింతామణి, కర్ణాటక
  • శ్రీ సర్వ వినాయక దేవాలయం, మునిసిపల్ ఆఫీస్ రోడ్, పావుగోడ, కర్ణాటక
  • శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, రమ్య గ్రౌండ్ దగ్గర, కూకట్ పల్లి, హైదరాబాద్
  • శ్రీ విజయ గణపతి దేవస్థానం, గాంధీ చౌక్, ఖమ్మం, తెలంగాణ ‘
  • శ్రీ చండేశ్వర దేవస్థానం, హోసూర్, తమిళనాడు
  • గణేష్ దేవస్థానం, గిరి రోడ్, బారంపూర్, ఒరిస్సా
  • శ్రీ గణపతి అంబలం, బస్టాండ్ రోడ్, త్రివేండ్రం, కేరళ
  • శ్రీ వినాయక ఘాట్ దేవస్థానం, దేవ నగర్, కర్నూలు
  • శ్రీ మహా గణపతి, లక్ష్మీ నరసింహ దేవస్థానం, సింహాచలం, ఆంధ్ర ప్రదేశ్
  • శ్రీ మోక్ష గణపతి దేవస్థానం, బెంగళూరు,
    *శ్రీ గణేష్ మందిర్, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, మార్కాపురం, ప్రకాశం జిల్లా
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news