సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఎక్కువగా డబ్బు పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కేవలం డబ్బువస్తే చాలు ఎలాంటి రోల్స్ లోనైనా నటిస్తాం.. ఎలాంటి పనులైనా చేస్తాం అంటూ లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉంటారు . కేవలం ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ నే కాదు నెపోటిజం పేరుతో ఇండస్ట్రీలోకి తాతల పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని వచ్చిన ముద్దుగుమ్మల సైతం అదే విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు . కాగా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
స్టార్ నిర్మాత మహేష్ భట్ మరియు నటి సోనీ రంజనాద్ ల కుమార్తె అయిన అలియా భట్ ..”స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆలియా ఆ తర్వాత ఎలా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . రీసెంట్ గానే ఉత్తమ జాతీయ నటి గా అవార్డు వరించింది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆలియా పై స్పెషల్ ఫోకస్ పడింది . అసలు ఆలియా ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ..? ఆమె టోటల్ ఆస్తి ఏంటి ..? అన్నదాని పై ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు .
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అలియా. ఒక్కొక్క సినిమాకి 7 నుంచి 8 కోట్లు అందుకుందట . అంతేకాదు అలియా భట్ నికర ఆస్తులు దాదాపు 600 కోట్లకు పైగానే ఉంటాయి అంటూ తెలుస్తుంది . కాగా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ అనే ప్రొడక్షన్ హౌస్ లో కూడా ఆమె రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . కేవలం సినిమాల ద్వారా కాదు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని పబ్లిసిటీ చేస్తూ ప్రమోట్ చేస్తూ కూడా ఆమె నెలకు కోట్లలో అందుకుంటుంది.
తన సొంత దుస్తుల బ్రాండ్ Ed-A-Mamma నుండి అలియా భట్ కు భారీ లాభాలు వస్తున్నాయి. ఈ సంస్థ ఏడాది కిందటే రూ. 150 కోట్ల వ్యాపార స్థాయికి చేరుకుంది. ఇలా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ లో పెరిగిన అలియా భట్ డబ్బు విషయంలో మాత్రం చాలా చాలా పిసినారి . అంతేకాదు డబ్బు ఎలాగైనా సరే సంపాదించాలి అనే మనస్తత్వం కల అమ్మాయి . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కాగా పలు బ్రాండ్ ప్రొడక్ట్స్ ద్వారా నే అలియా భట్ కోట్లు సంపాదిస్తూ ఉండడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!