టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్టైలిష్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారు మ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం . కాగా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న బన్నీ ను రీసెంట్ గానే ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది . తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పుష్ప సినిమాకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పుష్ప ..పుష్ప సినిమా డైరెక్టర్ చేసిన సుకుమార్.. పుష్ప సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి .
ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప2 గ్లోబల్ స్థాయిలో రికార్డును కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా ముందు నుంచి బన్నీ చాలా మొండివాడు. ఏదైనా సరే తాను కోరుకున్నది జరగాలి అనుకునే టైప్ అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు “మా అన్నయ్య అల్లు అర్జున్ ఎలాంటి వాడంటే నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బట్టలను లాగేసుకునేవాడు. నేను చాలా ఇష్టంగా ఎంతో ప్రేమగా కొనుక్కున్న డ్రస్సులు.. జాకెట్స్ నా బీరువాలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను”.
“అయితే అవి ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఈవెంట్లకి వేసుకోవాలని ఆశపడతాను. కానీ నా ఆశలపై ఎప్పుడూ నీళ్లు చల్లుతూ ఉంటాడు బన్నీ ..నేను లేనప్పుడు నా బీరువాను ఓపెన్ చేసి ఆ డ్రెస్సులన్నీ కొట్టేస్తాడు ..ఆయనకు సంబంధించిన ఈవెంట్లో వేసుకుని కనిపిస్తాడు . ఆయన నా బట్టలు వేసుకున్నాడు అని ఆయన ఆ ఈవెంట్ లో కనిపించిన ఫొటోస్ వైరల్ అయితే కానీ నాకు తెలియదు.. ఎప్పుడైనా నేను అదే డ్రెస్ వేరే ఈవెంట్ కి తీసుకెళ్తే అదేంటి మీ అన్నయ్య డ్రెస్ వేసుకున్నావ్ అని తిరిగి నన్నే అడుగుతారు. ఇది నా డ్రెస్సే రా బాబు అని ఎన్నిసార్లు చెప్పినా వినరు . అలా అల్లు అర్జున్ నా బట్టలను నాకు తెలియకుండానే కొట్టేస్తాడు” అంటూ అల్లు శిరీష్ ఇంటర్వ్యూలో ఫన్నీగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!