Movies“ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది…...

“ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది… అనుష్క స‌క్సెస్ కొట్టిందా…!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి. దాదాపు మూడున్నర సంవ‌త్స‌రాల త‌ర్వాత అనుష్క వెండితెర మీద క‌నిపిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అనుష్క అభిమానుల‌తో పాటు తెలుగు ఆడియెన్స్‌లో చాలా మంది.. ఇటు మ‌హిళా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి… ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అస‌లు పెళ్లంటే ఇష్టం లేని .. పిల్ల‌ల‌ను క‌న‌డం ఇష్టం లేని అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌, పెళ్లి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వ‌గా సినిమాకు మంచి టాక్ కూడా వ‌చ్చింది. సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమా కంప్లీట్ ఎంట‌ర్టైనింగ్‌గాను, సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్‌గాను ఉండేలా తెర‌కెక్కించార‌ట‌. అయితే అనుష్క మాత్రం సినిమా చూడ‌డానికి చాలా లావుగా ఉందంట‌. ఇక రదన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటుగా, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news