మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో క్లాసికల్ సినిమాలు ఉన్నాయి.. అలాంటి సినిమాలలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి..అయితే ఇలాంటి క్లాసికల్ హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమాతో వస్తాడా అని ఆ రోజుల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నన సమయంలో వాసు అనే సినిమా తీసి దారుణమైన ప్లాప్ అందుకున్నాడు.
ఆ తర్వాత అదే అదే క్రమంలో జెమినీ సినిమా కూడా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇక మాస్ హీరోగా మారాలనుకున్న వెంకటేష్ ప్రయత్నం ఈ సినిమా ద్వారా బెడిసి కొట్టిందనే చెప్పాలి.. ఆ తర్వాత వెంకటేష్ కు కలిసి వచ్చిన ఫ్యామిలీ సినిమాల మాదిరిగానే మరో సినిమా చేసి హిట్ కొట్టాలని వసంతం సినిమా చేశాడు. వాసు, జెమినీ వంటి రెండు భారీ ప్లాప్‌ల తర్వాత వెంకటేష్‌కు దక్కిన హిట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా 2003లో విడుదలైంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించింది తమిళంలో అప్పటికి స్టార్ట్ డైరెక్టర్ గా ఉన్న విక్రమన్.. ఆయన తెలుగులో నేరుగా తీసిన మొదటి చిత్రం కూడా ఇదే ఈ సినిమా తర్వాత చెప్పవే చిరుగాలి అనే మరో సినిమా కూడా తీసి మంచి విజయం అందుకున్నారు విక్రమన్. ఈ సినిమాల తర్వాత ఆయన కెరీర్ కూడా అక్కడితో ముగిసింది. ఇక వెంకటేష్ వసంతం సినిమా విషయానికొస్తే ఈ సినిమా అంత పెద్ద క్లాసికల్ విజయాం సాధించడానికి గల ముఖ్యారణం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ఎస్ ఏ రాజ్ కుమార్ అని కచ్చితంగా చెప్పాలి.
ఎందుకంటే ఈ సినిమాని ముందుగా ప్రేక్షకులకు తీసుకువెళ్లింది ఈ సినిమా పాటలే.. ఆ తర్వాతే ఈ సినిమా కథ మరియు మిగతా విషయాలు. వసంతం సినిమాకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సింహాద్రి సినిమాకు పోటీగా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ రెండు సినిమాలకు ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంటుంది. అయినా కూడా సింహాద్రి ప్రభంజనం అప్పట్లో గట్టిగానే ఉండేది. ఆయన కూడా వసంతం సినిమా ఒక డీసెంట్ హిట్ గా నిలవడం కాకుండా వెంకటేష్‌ను మళ్ళీ ఫామ్ లో పడేసింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కళ్యాణి ఇద్దరు పోటీ పడి నటించారు.