గాండీవ ధారి అర్జున వరుణ్ తేజ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్. వరుణ్ గత ఏడాది నటించిన గని సినిమా కూడా డిజాస్టర్ అయింది. అయితే ఈ రేంజ్ లో నష్టాల్ని తీసుకురాలేదు. గని సినిమాతో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఎంతో కొంత పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది. లేకపోతే ఆ సినిమా నిర్మాత నిండా మునిగిపోయేవాడే..! గాండీవ ధారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాపై ముందు నుంచి పెద్ద అంచనాలు లేవు. అందుకే నాన్ థియేట్రికల్ ఆదాయం కూడా పెద్దగా రాలేదు.
సినిమా ఎలాగూ డిజాస్టర్ అయింది.. కనీసం వరుణ్ తేజ్ కి ఇస్తామన్న రెమ్యూనరేషన్ లో కూడా కోతలు పెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ముందు వరుణ్ కి రు. 12 కోట్ల పారితోషకం ఇస్తామన్నారు. బడ్జెట్ బాగా ఎక్కువ అయ్యేసరికి రెమ్యునరేషన్ రు. 8 కోట్లకు తగ్గింది. తర్వాత సినిమా క్వాలిటీ కోసం వరుణ్ తన పారితోషికాన్ని కూడా త్యాగం చేశాడు. తీరా చివరికి వచ్చేసరికి ఐదు కోట్లతో సరిపెట్టారు.
సినిమా ప్లాప్ అయ్యేసరికి వరుణ్ కూడా ఏం అడగలేకపోయాడట. విషయం ఏంటంటే ఈ సినిమాతో దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌కు ఏకంగా నాలుగు కోట్ల పారితోషకం ఇచ్చారు. అంటే ప్రవీణ్ తో పోలిస్తే వరుణ్ కి కేవలం కోటి రూపాయలు మాత్రమే అదనంగా లభించింది. గని ప్లాప్ అయినా వరుణ్ కి 10 కోట్ల వరకు పారితోషకం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
ఇక తన సినిమాకి నాన్ థియేటర్ రైట్స్ రూపంలో మంచి ఆదాయం వస్తుంది. అలాంటి దశలో వరుణ్ ఐదు కోట్లకు సినిమా చేశాడంటే.. మరో ఐదు కోట్లు నష్టపోయినట్టే లెక్క..! ఏదేమైనా గాండీవ ధారి సినిమాతో అందరూ కలిసి వరుణ్ తేజ్‌ను నిండా ముంచేశారు. ఇటు రెమ్యూనరేషన్ లో భారీగా కోతపడింది. అటు తర్వాత సినిమాలకు మార్కెట్ భారీగా పడిపోయింది.