Moviesవాళ్లు అన్న మాట‌ల‌కు స్టేజ్‌మీదే భోరున ఏడ్చేసిన ర‌మ్య‌కృష్ణ‌… రాఘ‌వేంద్ర‌రావు ఏం...

వాళ్లు అన్న మాట‌ల‌కు స్టేజ్‌మీదే భోరున ఏడ్చేసిన ర‌మ్య‌కృష్ణ‌… రాఘ‌వేంద్ర‌రావు ఏం చేశారంటే..!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వయసు 55 సంవత్సరాలు దాటుతున్న ఎప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో మూడున్న‌ర‌ దశాబ్దాల క్రిందట ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ముందుగా తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నాగార్జున హీరోగా చేసిన సంకీర్తన సినిమాలో నటించింది. రమ్యకృష్ణది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన రమ్యకృష్ణ ముందు డ్యాన్సర్ గా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక సంకీర్తన సినిమా నాగార్జునకు కెరీర్ పరంగా రెండో సినిమా. ఆ సినిమాలో నాగార్జున కి జోడిగా సరైన హీరోయిన్ ను వెతుకుతున్న క్రమంలో రమ్యకృష్ణను ఎంపిక చేశారు. కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణకు కాలం కలిసి రాలేదు. ఎన్నో ప్లాపులు వచ్చాయి.. సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న సినిమాలు.. చిన్న చిన్న పాత్రలతోనే కాలం గ‌డిపేసింది. చాలామంది ఆమెను ఈ బక్కపల‌చ‌ని పిల్ల హీరోయిన్ ఏంటని ? విమర్శలు చేశారు. ఆమెను నానా విధాలుగా అవమానించారు.

అలాంటి సమయంలో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో రమ్యకృష్ణ మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో నటించి అద్భుతంగా మెప్పించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రమ్యకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా విజ‌యోత్స‌వ‌ వేడుకలలో తనను ఎందుకు పనికిరాన‌ని ఇండస్ట్రీలో చాలామంది అవమానించారని.. అలాంటిది ఈ సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకున్నాను తనకు మంచి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుకి గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని భోరున‌ ఏడ్చేసింది.

వెంటనే రాఘవేంద్రరావు ఆమెను ఓదార్చడంతో పాటు నిన్ను ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా చేస్తాను అని అక్కడే మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను తాను డైరెక్ట్ చేసిన చాలా సినిమాలలో హీరోయిన్గా చాన్సులు ఇచ్చి ప్రోత్సహించారు. చివరికి తన సొంత బ్యాన‌ర్‌లో తెరకెక్కించిన సినిమాలలోనూ రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉండేది. అలా రమ్యకృష్ణ రాఘవేంద్రరావు చేతిలో పడ్డాక తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిపోయింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news