Moviesనేచురల్ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

నేచురల్ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎప్పటినుంచో మల్టీస్టారర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ క‌లిసి న‌టించారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ క్రేజీ యంగ్‌స్ట‌ర్స్‌ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ మరో కుర్ర హీరోతో కలిసి మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ కుర్ర హీరో ఎవరో ? కాదు నేచురల్ స్టార్ నాని. నాని – బాలకృష్ణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య అంటే నానికి ఎంతో అభిమానం. బాలయ్య శ్రీరామరాజ్యం సినిమాకు అప్పటికే హీరోగా ఉన్న నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అలాగే నాని తన సినిమాలలో బాలయ్య అభిమానిగా నటించారు. బాలయ్య టాక్ షో అన్‌ష్టాప‌బుల్‌కు గెస్ట్ గా వచ్చాడు నాని.

అలాగే నాని ఎప్పటికప్పుడు బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నాడు. బాల‌య్య‌, నంద‌మూరి అభిమానులు కూడా నానిని బాగా లైక్ చేస్తూ ఉంటారు. అటు బాలయ్యకు కూడా నాని అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ టైం లోనే బాలయ్య – నాని మల్టీస్టారర్ కథ‌ అనిల్ రావిపూడి మదిలో తట్టడంతో ఆ విషయాన్ని బాలయ్యకు మెయిన్ లైన్‌ చెప్పగా.. నువ్వు ఎప్పుడైనా కథ రెడీ చేసుకో నేను ఈ సినిమాలో నటిస్తానని హామీ ఇచ్చేసారట. ఇక నాని మాత్రం బాల‌య్య‌తో చేసేందుకు ఎందుకు కాదంటారు..! భగవంత్‌ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా కోసం చిరంజీవి ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి. ఆ తర్వాత ఎప్పుడైనా బాలయ్య – నాని మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news