Moviesబన్నీ కి కాకుంటే..జాతీయ అవార్డు ఆ హీరోకే వచ్చుండేదా..? జస్ట్ మిస్..!!

బన్నీ కి కాకుంటే..జాతీయ అవార్డు ఆ హీరోకే వచ్చుండేదా..? జస్ట్ మిస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ను రీసెంట్ గానే జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన పుష్ప సినిమాలో నటించినందుకు గాను.. ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వరించింది . గత 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన కలను తీర్చేసాడు అల్లు అర్జున్ .

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఫస్ట్ టైం ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న హీరోగా రికార్డు నెలకొల్పాడు. కాగా ఇలాంటి క్రమంలోనే చాలామంది బన్నీని నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాలో చేసిన రోల్ కి ఆయన పర్ఫామెన్స్ కి అసలు జాతీయ అవార్డు ఎలా ఇచ్చారని ..? మండిపడుతున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి జాతీయ అవార్డు ఎన్టీఆర్కు రావాల్సి ఉందట . ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ కి ఈ అవార్డు గురించి ఉండాల్సింది .

కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు.. ఒక హీరోకి అవార్డు ఇచ్చి మరొక హీరోకి అవార్డు ఇవ్వకపోతే పెద్ద ఇష్యూ అయిపోతుందని .. పైగా ఇద్దరు పలుకుబడి ఉన్న హీరోలు కావడంతో సినిమా ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారుతుందని ఈ క్రమంలోనే అదే స్ధాయిలో కాంపిటీషన్ ఇచ్చిన మరో హీరో బన్నీకి అవార్డును ఇచ్చారట నిర్వాహకులు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా రాంచరణ్ ఆ సినిమాలో లేకపోయి ఉంటే మాత్రం అల్లు అర్జున్ ఈ సంవత్సరం ఖచ్చితంగా అవార్డు అందుకునేవాడు. కానీ అల్లు అర్జున్ ఆ ఘనత ఎగరేసుకుపోయాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news