Moviesబాలయ్య కి తెలియకుండా అలాంటి పని చేసిన అనిల్ రావిపూడి..మోక్షజ్ఞ కూడా...

బాలయ్య కి తెలియకుండా అలాంటి పని చేసిన అనిల్ రావిపూడి..మోక్షజ్ఞ కూడా చేతులు కలిపాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసిం హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సినిమాలు.. మాస్ సినిమాలు చేస్తే రిజల్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ బ్లాస్ట్ అయిపోతుంది. కాగా ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరే వైరల్ అవుతుంది. త్వరలోనే ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటున్నారను తప్పిస్తే ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇవ్వనేలేదు . కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం బాలయ్య దానికి సంబంధించిన పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. చాలా బొద్దుగా ఉండే మోక్షజ్ఞ సైతం స్లిమ్ గా మారి చాలా హ్యాండ్ సమ్ లుక్స్ లో అచ్చం హీరోలా తయారయ్యారు . ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ పోస్ట్ చేస్తున్న పిక్స్ అన్ని సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే వచ్చాం.

కాగా గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది . అదే మోక్షజ్ఞ గెస్ట్ రోల్ . ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమానే గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అని .. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ రెండు నిమిషాల పాటు నటించబోతున్నాడట . అది కూడా కేవలం గెస్ట్ రోల్ . అనిల్ రావిపూడి ఈ పాత్రను ప్రత్యేకంగా రాసుకున్నారట. దానికోసమే రీసెంట్గా సెట్స్ లో సైతం పాల్గొన్నారు . అయితే బాలయ్య కి ఈ విషయం తెలియదు. అయితే మొదటి నుంచి బాలకృష్ణ మోక్షజ్ఞను పెద్ద సినిమా ద్వారా లాంచ్ చేయాలని అనుకున్నారు.

కానీ అనిల్ రావిపూడి ఇచ్చిన సజెషన్ మేరకే బాలయ్య ఇలా భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . అంతేకాదు అనిల్ రావిపూడి బాలయ్య పర్మిషన్ లేకుండానే రెండు మూడు షాట్స్ కూడా చిత్రీకరించారట . బాలయ్య ఓకే చెప్తే మోక్షజ్ఞ సీన్స్ సినిమాలో ఆడ్ చేస్తారట. నో చెప్తే మాత్రం ఆ రోల్ అసలు తెరపైన కనిపించకుండా చేసేస్తారట. మొత్తానికి బాలయ్య సైతం అనిల్ సజెషన్స్ ఫాలో అవుతున్నాడు. భగవంత్ కేసరి సినిమాలో మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news