Movies' స‌లార్ ' ట్రైల‌ర్‌పై రెండు గూస్‌బంప్స్ అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌…!

‘ స‌లార్ ‘ ట్రైల‌ర్‌పై రెండు గూస్‌బంప్స్ అప్‌డేట్లు వ‌చ్చేశాయ్‌…!

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. కేజిఎఫ్ సీరిస్‌ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్లు వేగవంతం చేస్తున్నారు. సలార్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సలార్ ట్రైలర్ పై రెండు గూస్‌బంప్స్‌ లాంటి అప్డేట్లు వచ్చేసాయి. సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 3, 2023న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక సలార్ ట్రైలర్ రన్ టైం కూడా లాక్ అయింది. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ రన్ టైం రెండు నిమిషాల 37 సెకండ్లు ఉంటుందని అంటున్నారు. ట్రైలర్లో భారీ యాక్షన్.. మాస్ హంగులు అదిరిపోయే విజువల్స్ ఫ్యాన్స్ ని ఎంతో మెస్మ‌రైజ్ చేస్తాయట. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఈశ్వ‌రీరావు, శ్రియా రెడ్డి తదితరులు కీలకపాత్రను పోషించారు. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ర‌వి బ్ర‌సూర్ మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news