సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు. కానీ రమ్యకృష్ణ లాంటి అందం అలాంటి నటన ఇప్పటివరకు ఏ హీరోయిన్ కనుబరచలేదని చెప్పాలి . రీసెంట్గా ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో రమ్యకృష్ణ తన మనసులోని మాటలను బయటపెట్టింది . ఈ క్రమంలోనే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపిక గా సమాధానం చెప్పింది .
ఇలాంటి క్రమంలోని ఒకప్పటి హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటి ..? అనే విషయం చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ . ఇప్పుడు వస్తున్న కథానాయకులకు మీలా 20 – 25 ఏళ్లు లాంగ్ పీరియడ్ ఉండడం లేదు..? దానికి కారణం ఏమనుకుంటున్నారు..? అంటూ ప్రశ్నించారు . ఈ క్రమంలోని రమ్యకృష్ణ మాట్లాడుతూ..” ఒకప్పుడు మాకు తప్పులు చేయడానికి తప్పులు సరిదిద్దుకోవడానికి టైం ఉండేది.. కానీ ఇప్పుడు అది లేదు ఎంత త్వరగా వస్తున్నారో అంతే త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతున్నారు . కానీ మేము కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్లు తక్కువ టైం కి సంపాదించేస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు.. దాన్నిబట్టే మనం మారాలి.. జీవితంలో ఏది స్థిరం కాదు అనేది నేను తెలుసుకున్నాను”.
” ఉన్నదానితో అడ్జస్ట్ అవ్వడం ది బెస్ట్ . ఏది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కూడా మన నుంచి వెళ్ళిపోతుంది . మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి అదే మారుతుంది ..ఒకవేళ దుఃఖంలో ఉంటే అది కూడా మారుతుంది సో ఏది శాశ్వతం కాదు.. ఉన్నదానితో అడ్జస్ట్ అవ్వడం సంతోషపడడం అదే బెటర్ “అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు భవిష్యత్తులో రమ్యకృష్ణ కొడుకు రిత్విక్ సినిమాలోకి వస్తాడా..? అంటే “అది నాకు తెలీదు వాడికి కూడా తెలియదు కన్ఫర్మ్ అయ్యాక మీకే చెప్తాను” అంటూ ఫన్నీగా కౌంటర్ వేసింది..!!