Movies"స్కంద" స్టోరీ చెప్పగానే చేతులెత్తి దండం పెట్టేసిన తెలుగు హీరో..బోయపాటి అంతలా...

“స్కంద” స్టోరీ చెప్పగానే చేతులెత్తి దండం పెట్టేసిన తెలుగు హీరో..బోయపాటి అంతలా బయపెట్టేసాడా..!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండటం సర్వసాధారణం . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే అలా చాలామంది స్టార్స్ తమకోసం రాసుకున్న కథను మిస్ చేసుకుని కొందరు హిట్ కొట్టారు . కొందరు సక్సెస్ అయ్యారు . అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి .

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద . ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించారు. హీరోయిన్ గా శ్రీలీల నటించింది . అయితే ఈ సినిమా సెప్టెంబర్ 15న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాని మొదటగా బోయపాటి శ్రీను టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కోసం రాసుకోచ్చారట. ఇదే కథను మహేష్ బాబుకు చెప్పగా చేతులెత్తి దండం పెట్టి సినిమా రిజెక్ట్ చేసేసారట .

ఇంత మాస్ యాంగిల్ నా కటౌట్ కి సెట్ అవ్వదు అంటూ సున్నితంగానే ఈ సినిమా రిజెక్ట్ చేసారట మహేష్ బాబు . ఆ తర్వాత ఈ సినిమా కోసం పలువురు హీరోలను అప్రోచ్ అయిన అందరూ హీరోలు సినిమాలో మాస్ యాక్షన్ ఎక్కువగా ఉందని ఇంతటి సీన్స్ లో నటించలేం అంటూ చెప్పారట. ఫైనల్లీ బోయపాటి మాస్ యాక్షన్ సీన్స్ కు పడిపోయాడు రామ్ పోతినేని . ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.మరి ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలను ఒప్పుకొని రాంపోతినేని మంచి పని చేశాడా..? లేక తన కెరియర్నితనే చిక్కుల్లో పెట్టుకున్నాడా ..? తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news