ప్రభాస్ సలార్ సినిమా విడుదల ఇక రోజుల్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు తేలటం లేదు. కీలకమైన నైజాం ఏరియను ఎవరు ? పంపిణీ చేస్తారో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలో తమ సినిమాలు సొంతంగా పంపిణీ చేసుకున్న హోమ్ బలే సంస్థ ఈసారి అలా చేయడం లేదు. ఈ క్రమంలోనే నైజాం భారీ రేటు కోట్ చేస్తున్నారు
ఈ క్రమంలోనే దిల్ రాజు నైజాం ఏరియాను నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్‌కింద రు. 65 కోట్లు, రిటర్న్ బుల్ అడ్వాన్స్ కింద రు. 15 కోట్లు… మొత్తం రు. 80 కోట్లు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది చాలా భారీ మొత్తమే అని చెప్పాలి. నైజాంలో ఆదిపురుష్ రు. 35 కోట్ల దగ్గర ఆగిపోయింది. అయితే సలార్ నైజాం లెక్కలు వేరు కావడంతో రాజు భారీ రేటు కోట్ చేస్తున్నారు.
ఇలా కుదరకపోతే రు. 90 కోట్ల రేంజ్‌లో రిటర్నబుల్ అడ్వాన్స్ కోట్ చేసి.. జస్ట్ 5-6 శాతం కమీషన్ మీద రిలీజ్ చేయించే ఆలోచనలో కూడా హోంబలే ఫిలింస్ సంస్థ రైట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా చేసినా కూడా పెద్ద రిస్కే. ఎందుకంటే రెండు నెలల పాటు వడ్డీ లేకుండా అన్ని కోట్లు బ్లాక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఏదేమైనా నైజాంలో సలార్ సినిమాకు రు. 90 కోట్ల బిజినెస్ అంటే అది టాలీవుడ్ హిస్టరీలోనే వేరే లెవల్ అని చెప్పాలి. సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతోంది.