Moviesబాల‌య్య డైరెక్ట‌ర్‌ను ప‌ట్టేసిన చిరు… హిట్ కోసం ఎన్ని తిప్ప‌లు సార్‌..?

బాల‌య్య డైరెక్ట‌ర్‌ను ప‌ట్టేసిన చిరు… హిట్ కోసం ఎన్ని తిప్ప‌లు సార్‌..?

తాము ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసిందా అన్నట్టుగా మెగా హీరోల పరిస్థితి ఉంది. మెగా హీరోలు వరుస పెట్టి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. పైగా ఇద్దరు మెగా హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టార‌ర్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేస్తున్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలో ముగ్గురు మెగా హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు అతిపెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అంటే వారి బాధ ఎలా ? ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలు మెగా హీరోలు ఎంచుకునే ? కథలలో లోపం లేదా వారు నమ్ముకున్న డైరెక్టర్లు ముంచేస్తున్నారో తెలియదు కానీ.. మెగా హీరోలు అటు టాలీవుడ్ ని.. ఇటు బయ్య‌ర్లను ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే భోళా శంకర్ దెబ్బ తర్వాత చిరంజీవి పూర్తిగా రూటు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రీమిక్స్ సినిమాలు పక్కన పెట్టేసి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని కామెడీ డైరెక్టర్ గా పేరు అన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేసేందుకు ఆయనే స్వయంగా అనిల్‌ను రిక్వెస్ట్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

రీసెంట్ గానే చిరు పుట్టినరోజు సందర్భంగా నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ తో బింబిసారా లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన వశిష్ట్‌తో ఒక సినిమా కమిట్ అయ్యారు చిరంజీవి. ఇక ఇప్పుడు కూడా బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా చేయాలని చిరంజీవి గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా అనిల్ రావిపూడి కూడా చిరంజీవిని కలిసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా వరుస విజయాలతో ఉన్న బాలయ్య డైరెక్టర్ తో ఇప్పుడు చిరంజీవి నటిస్తే ఖచ్చితంగా ఆ కాంబినేషన్కు కాస్త క్రేజ్ ఉంటుందని చిరంజీవి ఆశపడుతున్నట్టుగా అర్థమవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news