ఒక్కటి మాత్రం నిజం బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది స్వీటీ అనుష్క. అయితే మధ్యలో ఆమె కే రాఘవేంద్రరావు తనయుడు కే ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో చేసిన సైజ్ జీరో సినిమా ఆమె కెరీర్ను పాతాళంలో పడేసింది. ఆ సినిమాలో పాత్ర కోసం అనుష్క బాగా లావు ఎక్కింది. ఇందుకోసం ఎక్కువ ఫుడ్ కూడా తీసుకుంది. ఆ సినిమాలో పాత్ర కోసం ఆమె ఎంతలా ప్రాణం పెట్టి పనిచేసినా సైజ్ జీరో సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.
అనుష్క కష్టానికి తగిన ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అనుష్క బరువు తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత ఆమె ఫిజిక్ మొత్తం పూర్తిగా దెబ్బ తినేసింది. ఇక భాగమతి సినిమాలోని అనుష్క ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపించాయి. తాజాగా మూడున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత అనుష్క వచ్చే నెలలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమె తనకంటే వయసులో చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టికి జంటగా నటిస్తోంది.
ఇప్పటికే నవీన్ ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు. అయితే అనుష్క మాత్రం అస్సలు బయటికి రావటం లేదు. కనీసం ఓ ఫంక్షన్కు అయిన రావచ్చు కదా ? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే అసలు ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయకుండా ఉంటే బెటర్ అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. తీరా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే హీరోయిన్ అనుష్క రాకపోతే అసలు బాగోదు అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
అనుష్క మాత్రం తాను ఎఫ్ఎం ఇంటర్వ్యూలకు మాత్రమే వస్తానని చెబుతోందట. అందులో ఫేస్ చూపించనక్కర్లేదు.. ఓ హీరోయిన్ సినిమాలో నటించి ఫేస్ చూపించిన తర్వాత కనీసం ఒక ప్రెస్ మీట్ కు కూడా రాను.. ఫేస్ చూపించను అంటే చాలా సందేహాలు వస్తాయి. అసలు కారణం ఏంటంటే ? అనుష్క లుక్స్ పూర్తిగా మారిపోయాయని.. ఆమె మనం అనుకున్న దానికంటే బాగా లావు అయిపోయింది అన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అసలు అనుష్కను గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని.. అయితే సినిమా వరకు సిజి పనులు బాగా చేసి మేనేజ్ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా అనుష్క గుమ్మం పట్టనంత లావిక్కిపోయిందని.. అందుకే ఆమె బయటకు వచ్చేందుకు.. తనపై ట్రోలింగ్ ఛాన్స్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.