Moviesటాలీవుడ్‌కు మ‌రో ఐరెన్‌లెగ్ వ‌చ్చింద్రా బాబు… ఆమె పాదం పెడితే సినిమా...

టాలీవుడ్‌కు మ‌రో ఐరెన్‌లెగ్ వ‌చ్చింద్రా బాబు… ఆమె పాదం పెడితే సినిమా ఫ‌ట్‌..!

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్లు ఇచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే తర్వాత ఇక్కడ పెద్ద ఐరన్ లెగ్ హీరోయిన్ అయిపోయింది. ఆమె నటించిన సినిమాలో వరుస పెట్టి ప్లాపులు అవుతుండడంతో ఆమెకు మనోళ్లు ఐరన్ లెగ్ ముద్ర వేసేశారు. చాలా తక్కువ టైంలోనే పూజ నటించిన 3 – 4 సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఆ తర్వాత మరో హీరోయిన్ రష్మిక మందన్నాది కూడా అదే పరిస్థితి. ఆమెకి కూడా వరుసగా ప్లాపులు వచ్చాయి.

అయితే పూజ – రష్మిక కేరీర్‌ ప్రారంభంలో కొన్ని హిట్లు అయినా నమోదు చేశారు. తాజాగా ఒక కొత్త‌ హీరోయిన్ మాత్రం కెరీర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఆ హీరోల కెరీర్ లోనే అతిపెద్ద ఎపిక్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఆమె టాలీవుడ్లోకి వచ్చి రావడంతోనే పెద్ద ఐరన్ హీరోయిన్గా ముద్ర పడిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సాక్షి వైద్య. అక్కినేని అఖిల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.

ఈ సినిమా దెబ్బతో నిర్మాత అనిల్ సుంకరతో పాటు ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ గాయత్రి సతీష్ తమ కెరీర్ లో సంపాదించిన దాంట్లో చాలా వరకు నష్టపోయారు. అసలు ఇప్పట్లో వీరు కోలుకోవ‌డం పెద్ద కష్టం అంటున్నారు. ఇక ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ పై పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన గాండీవ ధారి అర్జున సినిమాలోని సాక్షి వైద్య హీరోయిన్. ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అవడంతో పాటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కు ఏకంగా రు. 20 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన కూడా తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లబోదిబో అంటున్నారు.

ఏది ఏమైనా సాక్షి వైద్య నటించిన తొలి రెండు సినిమాలు కూడా ఆ హీరోల కెరీర్ లో పెద్ద డిజాస్టర్లు అయిపోవడంతో సాక్షిని అప్పుడే టాలీవుడ్ జనాలు ఐరన్ లెగ్ అంటున్నారు. ఇకపై ఆమెకు అవకాశాలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అసలు సాక్షిని తమ సినిమాలలో పెట్టుకుంటే తమది కూడా ఏజెంట్ – గాండీవ ధారి పరిస్థితి అవుతుందా ? అన్న టెన్షన్ లో పడిపోయారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news