Moviesటాలీవుడ్‌కు ' మెగా గుదిబండ‌ ' … మెగా హీరోల సినిమాలంటేనే...

టాలీవుడ్‌కు ‘ మెగా గుదిబండ‌ ‘ … మెగా హీరోల సినిమాలంటేనే వ‌ద్దు బాబోయ్ అని దండాలు…!

సినిమాల పరంగా మెగా హీరోలది చాలా పెద్ద కాంపౌండ్. సగటున నెలకు ఒక మెగా హీరో సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆ కాంపౌండ్ ఎప్పుడు నిత్యం సినిమాలతో కళకళలాడుతూ ఉంటుంది. సీనియర్ హీరో చిరంజీవి నుంచి నిన్నగాక మొన్న వచ్చిన వైష్ణవ తేజ్ వరకు అంతా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటారు. నిత్యం బిజీగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మెగా హీరోలు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా డిజాస్టర్ అవుతూ తెలుగు సినిమా పాలిట పెద్ద గుడిబండ మాదిరిగా తయారవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లలో నటించిన సినిమాలలో ఒక్క భీమ్లా నాయక్ తప్ప అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన బ్రో సినిమా కూడా 30 కోట్ల నష్టాలు తెచ్చి పెట్టింది. పైగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి చేసిన భోళా శంకర్ అతిపెద్ద డిజాస్టర్. తాజాగా వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా కూడా వరుణ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయిపోయింది.

వరుణ్ గత ఏడాది నటించిన గని సినిమా కూడా డిజాస్టర్. ఇలా వరుసగా మెగా హీరోల సినిమాలు దెబ్బ మీద దెబ్బ వేస్తుండడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కుదిలవుతున్నారు. కేవలం నెలరోజులు వ్య‌వ‌ధిలోనే మూడు ప్లాప్ సినిమాలు అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవాలి. మెగా హీరోల సినిమాలు దెబ్బకు అటు నైజాంలోనూ.. ఇటు ఆంధ్రాలోనూ ఆ సినిమాలు కొన్న బయ్యర్లు అందరూ కుదేలు అయిపోతున్నారు. చాలా దారుణంగా నష్టపోతున్నారు.

వాళ్ళు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్లతో సినిమాలు తీసేందుకు కూడా నిర్మాతలు వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. చివరకు కొందరు బయ్యర్లు అయితే బాబోయ్ అసలు మాకు మెగా హీరోల సినిమాలు వద్దే వద్దని దండాలు పెడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పటికీ మార్పు వస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news