Moviesబన్నీ లైఫ్ లో అలా జరుగుతుందని ఆమెకి ముందే తెలుసా.. చెప్పింది...

బన్నీ లైఫ్ లో అలా జరుగుతుందని ఆమెకి ముందే తెలుసా.. చెప్పింది చెప్పిన్నట్లే జరిగిందిగా(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది .. దానికి కారణం రీసెంట్ గానే ఆయనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వరించడమే. పుష్ప సినిమాకి గాను ఏకంగా ఆయనకు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు వరిచింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో బన్ని టాప్ పొజిషన్లో నిలిచాడు.

దీంతో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది . అయితే అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోబోతున్నాడు అని ముందుగానే ఒక హీరోయిన్ గెస్ చేసింది. ప్రజెంట్ అదే న్యూస్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు ..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించిన రష్మికనే.

గతంలో పుష్ప సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..” అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడని.. ఈ సినిమా హిట్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ మొత్తం అల్లు అర్జున్ నే అని..ఆయనకి అవార్డు వస్తుందని చెప్పుకొచ్చింది”. ప్రజెంట్ ఇదే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు రష్మిక మందన్నా చెప్పినట్లే బన్నీ లైఫ్లో జరిగింది అంటూ ఆమెను ట్యాగ్ చేసి మరీ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news