చిత్ర పరిశ్రమలో చాలామంది పెళ్లైన హీరోలు, హీరోయిన్లు కూడా తమతో కలిసి నటించే సహనటులు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అయితే వారిలో కొంతమందికి వేరే రకమైన ఇష్టం ఉంటేటే మరి కొంతమందికి మరో రకమైన ఇష్టం ఉంటుంది. వారిలో కొంతమంది పెళ్లి అయ్యాక కూడా వారిపై ఉన్న ఇష్టంతో సీక్రెట్ గా వారితో సంబంధాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు.
ఈ విధంగా టాలీవుడ్ లో కూడా ఇలా సంబంధాలు కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే వారందరి పేర్లు చెప్పుకోవటం ఇప్పుడు అనవసరం.. కానీ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కి కూడా పెళ్లయిన ఓ హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమట. అయితే మీరు అనుకున్నట్లు వేరే రకమైన ఇష్టమైతే కాదు. నటనపరంగా ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్ అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టమట. ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇక అల్లు అర్జున్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఎవడు, ఆర్య-2 వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో నటించే సమయంలో కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ కి మంచి అనుబంధం ఏర్పడిందట. అప్పటినుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉందట.
అలాగే తనతో టైం స్పెండ్ చేస్తే అల్లు అర్జున్ కి చాలా రిలాక్స్ గా అనిపిస్తుందట. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా మరోసారి తన సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకుంటాను అని అల్లు అర్జున్ అప్పట్లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి కానీ ఇప్పటి జనరేషన్ లో మాత్రం కాజల్ అగర్వాల్ అంటే ఇష్టమట.