Movies' ఖుషి ' స‌మంత‌, విజ‌య్ కోసం కాదు వాళ్ల కోసం...

‘ ఖుషి ‘ స‌మంత‌, విజ‌య్ కోసం కాదు వాళ్ల కోసం ఆడాలి.. లేక‌పోతే ఇండ‌స్ట్రీలో ఉండ‌దు..!

రాబోతున్న పెద్ద సినిమా ఖుషి ఈ సినిమా మీద మంచి అంచనాలు బజ్‌ అయితే ఉంది. మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా హిట్ అవ్వటం హీరో విజయ్ దేవరకొండకు సమంతకు ఎంత ముఖ్యమో అంతకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. ఈ సంవత్సరం వచ్చిన పెద్ద సినిమాలు అంచనాలు ఉన్న సినిమాలు అన్ని డిజాస్టర్లు అయ్యాయి. విజయ్ దేవరకొండ లైగ‌ర్ లాంటి డిజాస్టర్ తర్వాత రేసులో వెనకబడిపోయాడు. సమంత కూడా యశోద, శాకుంతల సినిమాలు డిజాస్టర్లు అవడంతో డీలా పడిపోయింది.

అందుకే ఈ సినిమా విజయం సాధించడం సమంత- విజయ్ ఇద్దరు కెరీర్లకు చాలా ముఖ్యం ఇక ఈ ఏడాది థియేటర్లో నడిపే ఎగ్జిబిటర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు.. బయ్యర్లు అడిగినప్పుడల్లా అడ్వాన్సులు పంపారు. దీంతో ఇప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్సులు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు అన్ని సినిమాలు వరుసగా ప్లాప్‌లు అవడంతో అడ్వాన్సులు ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున‌ సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది.

అయితే ఖుషి తేడా కొట్టదు అన్న నమ్మకం ఉంది. కానీ ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే తర్వాత వచ్చే సినిమాలు అన్నింటికీ అడ్వాన్సులు ఇవ్వలేరు.. వచ్చిన ప్రతి సినిమా బకెట్ తన్నిస్తూ పోతే ఇక థియేటర్లో నడిపె ఎగ్జిబిటర్ల దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. వాళ్ళు మాత్రం అడ్వాన్సులు ఎలా ఇస్తారు. ఇలా అయితే ఇండస్ట్రీ ఇటు థియేటర్లో నడిపే వాళ్ళు ఎలా బతికి బట్ట కడతారు అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ఖుషి విజయం సాధించడం అనేది ఇండస్ట్రీ మొత్తానికి ఎంతో ముఖ్యం ఇప్పుడు ఆశలు అన్ని విజయ్ దేవరకొండ- సమంత మీదే ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news