Movies"మీసాలు-గడ్డాలు పెంచితే నేషనల్ అవార్డ్ ఇచ్చేస్తారా..?".. ట్రోలర్స్ కి బన్నీ పగిలిపోయే...

“మీసాలు-గడ్డాలు పెంచితే నేషనల్ అవార్డ్ ఇచ్చేస్తారా..?”.. ట్రోలర్స్ కి బన్నీ పగిలిపోయే ఆన్సర్..!!

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఓ పేరే మారుమ్రోగిపోతుంది. అదే అల్లు అర్జున్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడి గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న విషయం మన అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’సినిమాకి గాను ఈ అవార్డు బన్నీని వరించింది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు.

అలాగే బూతులు కూడా తిడుతున్నారు. అసలు ఆ సినిమాలో ఏముంది.. కేవలం గడ్డాలు..మీసాలు పేంచి మాస్ లుక్స్ లో కనిపించి.. డైలాగ్స్ చెప్పితే నేషనల్ అవార్డ్ ఇచ్చేస్తారా..? అంటూ విమర్శలు కూడా ఎదురయ్యాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం ఆక్రమ రవాణా చేసే పుష్ప రాజ్ అనే స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో…స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు? అంటూ ట్రోలర్స్ మొదలయ్యాయి.

అయితే ఈ ట్రోలింగ్స్ పై తాజాగా బన్నీ ఘాతుగా స్పందించి ఒక్కోక్కడికి ఇచ్చిపడేసాడు. ఆయన మాట్లాడుతూ..” నేషనల్, ఆస్కార్ అవార్డ్స్ అనేది నటుడిగా ..ఓ మనిషిలోని యాక్టింగ్ చూసి ఇస్తారు. ఈ విషయం కొందరి కి తెలియకపోవచ్చు.. బ్యాట్ మెన్ లాంటి నెగటివ్ క్యారెక్టర్లకు ఆస్కార్ అవార్డు వచ్చింది అన్న విషయం మనం మర్చిపోకూడదు..ఒకప్పుడు జంజీర్, అగ్నిపథ్ సినిమాల్లో నటించిన అమితాబచ్చన్ గారి నటనకు నేషనల్ అవార్డులు వచ్చాయి. పుష్ప సినిమాలో ఉన్న నటననే పరిగణంలోకి తీసుకొని ఈ అవార్డు ఇచ్చారు అని నా అభిప్రాయం”అంటూ కూసింత ఘాటుగానే స్పందించారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news