Moviesన‌య‌న‌తార డాక్యుమెంట‌రీ... ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌...!

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది ఫెయిరీటేల్‌ అనే డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార కెరీర్ లో ఎలాంటి ఎత్తు పల్లాలు ఉన్నాయో ? వాటిని కవర్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి కష్టాలు ? ఎదుర్కొన్నారు తెలుపుతూ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత పలు వివాదాలకు దారితీస్తుంది. ధనుష్ తాను నిర్మించిన నానుమ్ రౌడీదాన్ ( నేనూ రౌడీనే ) సినిమాలో క్లిప్పింగులు వాడుకున్నారు అని కోర్టు మెట్లు ఎక్కారు.చంద్రముఖి - వికీపీడియా

ఆ టైంలో నయనతార ధనుష్ ను టార్గెట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీలో ఆయన నటించిన పలు సినిమాల సీన్లు కూడా ఉండడంతో పలువురు నిర్మాతలు మండిపడ్డారు. తాజాగా చంద్రముఖి సినిమాకు సంబంధించిన సీన్లు వాడడంతో ఆ సినిమా కాపీరైట్స్ తమ వద్ద ఉన్నాయని ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టి.. ఈ డాక్యుమెంటరీ నిర్మాత టార్క్ స్టూడియోస్ మరియు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.Nenu Rowdy Ne Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆ సినిమాలో పుట్టేసి వాడుకున్నారని.. దానిని వెంటనే తీసివేయాలని.. అలాగే తమకు ఐదు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ ఇంటర్నేషనల్ ఫిటిష‌న్‌ లో పేర్కొంది. మరి ఈ వివాదం పై నయనతార డాక్యుమెంటరీ నిర్మాతలు ఎలా స్పందిస్తారో ?చూడాలి.

Latest news