Movies' హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ' రిలీజ్ చేస్తారా.. చేయ‌రా.. బిగ్ ప్రెజ‌ర్‌...!

‘ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ‘ రిలీజ్ చేస్తారా.. చేయ‌రా.. బిగ్ ప్రెజ‌ర్‌…!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ మ‌రియు ఏఎం. జ్యోతికృష్ణ క‌లిసి డైరెక్ట్ చేసిన సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఈ సినిమా ఇప్ప‌టికే ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వ‌స్తోంది. వాస్త‌వంగా ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా మ‌రోసారి వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విష‌యంలో మేక‌ర్స్ మీద విప‌రీత‌మైన ప్రెజ‌ర్ అయితే బిల్డ‌ప్ అవుతోంది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు మేక‌ర్స్‌కు చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎన్నోసార్లు సినిమా ఆన్ టైంలో రావాల‌ని చెప్పినా అలా జ‌ర‌గ‌లేదు.. ఈ సారి మాత్రం డేట్ విష‌యంలో మార్పు ఉంటే త‌మ ఓటీటీ డీల్ మార్చుకోవాల్సి ఉంటుంద‌ని గ‌ట్టిగానే చెప్పింద‌ట‌.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జూలై ఎండింగ్ నాటికి సినిమా రిలీజ్ చేయాల‌ని చెప్పార‌ట‌. సో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వీర‌మ‌ల్లు జూలై చివ‌రి నాటికి థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది.

Latest news