Moviesసినిమా అట్ట‌ర్ ప్లాప్‌... రు. 4 కోట్లు వెన‌క్కు ఇచ్చిన టాలీవుడ్...

సినిమా అట్ట‌ర్ ప్లాప్‌… రు. 4 కోట్లు వెన‌క్కు ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో…!

జాక్ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది.. కని విని ఎరుగని రీతిలో నిర్మాత తో పాటు అందరూ మునిగిపోయారు. హీరో సిద్దు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ నుంచి నాలుగు కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పేమెంట్ ఒకటి రెండు రోజులలో వెళుతుంది. హీరో నుంచి నిర్మాతకు హీరోవైపు నుంచి నాలుగు కోట్లు అంకె వినిపిస్తోంది. అది నాలుగు కోట్ల అంతకన్నా తక్కువ అన్నది నిర్మాత వైపు నుంచి క్లారిటీ రావాలి. జాక్‌ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పరాజ‌యం పాలు అయింది. బయ్య‌ర్లు అంతా కుదేలు అయిపోయారు.. నిర్మాత భారీగా నష్టాల పాలయ్యారు. నైజాం థియేటర్ హక్కుల విషయంలో హీరో కూడా మధ్యలో ఉన్నారని వార్తలు వచ్చాయి. చివరికి రెమ్యూనరేషన్ లో సగం అంటే నాలుగు కోట్లు వెనక్కు ఇవ్వటానికి సిద్ధు ఓకే చెప్పారని తెలుస్తోంది.Jack Movie Review: జాక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Jack Movie Review in ...ఇప్పుడు సెటిల్ చేయకుంటే తర్వాత సినిమా విడుదలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. లేదా నిర్మాత తర్వాత సినిమాలకు ఇబ్బంది కావచ్చు.. అందుకే అందరూ మధ్యలో ఉండి డీల్ సెటిల్ చేసేసారు. ఇప్పుడు బయిర్లకు నిర్మాత సెటిల్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా నైజాం బ‌య్య‌ర్‌కు భారీగా నష్టం వచ్చింది. మరి ఎంత వెనుక ఇస్తారో చూడాలి. కోటిన్నర రికవరీ + జిఎస్టి రెండు ఇవ్వాలి. ఇంకా అదనంగా ఏమైనా ఇస్తారో ? ఇవ్వ‌రో కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ లో సగం వెనక‌కు ఇవ్వ‌డం అభినందించదగ్గ విషయం.

Latest news