టాలీవుడ్ ఇందస్ట్రీలో డైనమిక్ హీరో గా పాపులారిటి సంపాదించుకున్న విష్ణు మంచు బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో ర్లీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి అంతకంటే డబుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది. అసలు ఇలాంటి సినిమా మంచి విష్ణు చేస్తాడు అని ఊహించలేకపోయారు జనాలు.ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ వహించగా.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమా ను నిర్మించారు. ఈ సినిమాలో పాన్ ఇండియా లెవల్ లో స్టార్స్ నటించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ కాజల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించి ఇంకా హైప్ తీసుకొచ్చారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి స్పందన రాబట్టింది.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడి క్యారక్టర్ లో గంభీరమైన వాయిస్ తో మెప్పించాడు. ఇదే సినిమాకి మెయిన్ హైలెట్. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో ఈ సినిమా ను మరో మెట్టు ఎక్కించాడు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా నటించలేదు జీవించేసాడు అని చెప్పాలి. ఇక హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు మంచి మార్కులు వేయించుకుంటుంది.
ఇక సినిమాకి కర్త-కర్మ-క్రియ గా నిలిచింది మాత్రం హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్ ను ప్రభాస్ నిలబెట్టేసాడు. మరీ ముఖ్యంగా ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ పెన్నుకు పదును పెట్టాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో విష్ణు నా..? లేక ప్రభాస్ నా..? అని అనిపించేంత బాగా ఆయన రుద్ర పాత్ర ఉంది. ఇక ప్రభాస్ పెళ్లి డైలాగ్ కు థియేటర్స్ లో విజిల్స్ మోతే. ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన ఆయన కెరీర్ లోనే బెస్ట్ అనే టాక్ వినిపించింది. మరీ మరీ ఇంపార్టెంట్ శివయ్య కు తన కన్ను దానం చేసే సీన్ ఈ కన్నప్ప సినిమాకే హైలెట్ గా నిలిచింది. మొత్తానికి తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ధిఏటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. ఈ సినిమా కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో నిర్మించిన మోహన్ బాబు, విష్ణు ను మెచ్చుకుని తీరాలి . మరీ ముఖ్యంగా సినిమాకి ఒక్క రూపాయ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన ప్రభాస్ ఈ సినిమాకి రియల్ హీరో. సాంగ్స్ తో పాటు నేపధ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఇ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరు ధియేటర్స్ కి వెళ్లి చూడతగ్గ సినిమా..డోంట్ మిస్!!
Kanappa Review: అంచనాలను టోటల్ గా తలకిందులు చేసేసిన మంచు విష్ణు..మొత్తం క్రెడిట్ ఆ ఒక్కడిదే..!
