MoviesTL రివ్యూ కుబేర‌: థియేట‌ర్లో చూడాల్సిన ఇంటెన్స్ గ్రిప్పింగ్ సినిమా

TL రివ్యూ కుబేర‌: థియేట‌ర్లో చూడాల్సిన ఇంటెన్స్ గ్రిప్పింగ్ సినిమా

‘కుబేర’ మూవీ రివ్యూ
నటీనటులు: ధనుష్- అక్కినేని నాగార్జున- రష్మిక మందన్నా- జిమ్ సర్భ్- దలిప్ తాహిల్- సునైనా- హరీష్ పేరడి- షాయాజి షిండే-భాగ్యరాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
చాయాగ్రహణం: నికేత్ బొమ్మి
రచనా సహకారం: చైతన్య పింగళి
నిర్మాతలు: సునీల్ నారంగ్- పుస్కుర్ రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర (Kuberaa) సినిమా ఒక అసాధారణ కథాంశంతో, సామాజిక సమస్యలను ఆలోచింపజేసే విధంగా కలగలిపిన ఒక క్రైమ్ డ్రామా. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్భ్ వంటి నటీనటుల సమతూకంతో ఇంచు కూడా అతికి తావు లేకుండా నటించి థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా. ఈ చిత్రం అద్భుతమైన నటన, గ్రిప్పింగ్ గా సాగే కథనం, ఆలోచనాత్మక రచనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా ఒక ధనవంతుడి స్వార్థపూరిత అహంకారానికి ఒక సాధారణ పేద వాడికి మధ్య జరిగే పోరాటం.కుబేర రివ్యూ- నాగ్, ధనుష్ రూ. లక్ష కోట్ల డ్రామా- ప్రేక్షకులను మెప్పించిందా?

కథ (plot) ✒️
కుబేర కథ ఒక బిచ్చగాడు అయిన దేవ (ధనుష్) చుట్టూ తిరుగుతుంది. బంగాళాఖాతంలో అరుదైన ఆయిల్ రిజర్వ్‌ను కనుగొన్న వ్యాపారవేత్త నీరజ్ మిత్రా (జిమ్ సర్భ్), దానిని ధనం, అధికారం, మరియు రాజకీయ నియంత్రణ కోసం ఉపయోగించాలని అనుకుంటాడు. ఈ రహస్య ప్రాజెక్ట్ కోసం, అతను ఒకప్పటి నిజాయితీ గల సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున)ను ఎంచుకుంటాడు. దీపక్, బిచ్చగాళ్లను బినామీలు గా ఉపయోగించే ప్రణాళికను రూపొందిస్తాడు. వారు ఎంచుకున్న నలుగురు బిచ్చగాళ్లలో దేవ కూడా ఒకడు. అయితే, ఈ వ్యూహంలో తనను చంపే కుట్రను గుర్తించిన దేవ, పారిపోతాడు. ఈ సమయంలో అతను సమీరా (రష్మిక మందన్నా)ను కలుస్తాడు. ఇక్కడ నుండి కథ ఒక ఉత్కంఠభరితమైన జర్నీగా మారుతుంది.కుబేర' మూవీ HD స్టిల్స్‌ | Actor Dhanush And Nagarjuna Kubera Movie Photos  Gallery HD Stills Went Viral On Social Media | Sakshiనటన 🎭
ధనుష్: ఈ సినిమా ధనుష్ తన కెరీర్‌లోని అత్యుత్తమ నటన కనబరిచిన వాటిలో ఒకటిగా నిలిచిపోతుంది. బిచ్చగాడు దేవ పాత్రలో ధనుష్ చూపించిన నీతి, దయ, ఆత్మాభిమానం కలగలిపిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతని మాటలు, బాడీ లాంగ్వేజ్ మరియు భావోద్వేగాలు చూస్తూ మనం ధనుష్ ను మరిచిపోయి దేవనే గుర్తుపెట్టుకుంటాం. కచ్చితంగా భవిషత్తులో అవార్డును సాధించి పెట్టే స్థాయి నటన.
నాగార్జున: నాగార్జున దీపక్ పాత్రలో ఇమిడిపోయారు. నీతికి అవినీతికి మధ్య సంఘర్షణను అద్భుతంగా ప్రద్శించారు. కూల్ క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ, సహజ నటన పాత్ర స్థాయిని పెంచాయి.
రష్మిక మందన్నా: సమీరా పాత్ర చిన్నది కానీ ఇంపార్టెంటే. ఇప్పటికే హిట్ సెంటిమెంట్గా మారిన రష్మిక మళ్లీ దానిని ప్రూవ్ చేసింది. రష్మిక నటన బాగుంది..
జిమ్ సర్భ్ మరియు డాలిప్ తాహిల్: సాధారణ విలన్ పాత్రకు తన నటనతో జిమ్ సర్భ్ భారీ ఎలివేషన్ ఇచ్చాడని చెప్పాలి. అతని తెలుగు డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంది. నిజంగా ప్రేక్షకుడు జిమ్ సర్బ్ ను మరిచిపోయి దుర్మార్గపు వ్యాపారిని తిట్టుకునేంత లీనమయ్యేలా పాత్రలో కనిపించాడు జిమ్ సర్బ్. డాలిప్ తాహిల్ తన సీనియర్ అధికారి పాత్రలో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూపించాడు.Dhanush kubera movie postponed | కుబేర ధనుష్ శేఖర్ కమ్ముల | OkTeluguటెక్నికల్ అంశాలు 🎥🎵
దర్శకత్వం: శేఖర్ కమ్ముల తన సిగ్నేచర్ శైలి నుండి బయటకు వచ్చి తీసిన హార్డ్ హిట్టింగ్ మూవీ. ఈ సినిమాలో క్రైమ్ డ్రామాను… సోషల్ ఇష్యూ కలిపి బ్యాలెన్స్ చేసి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ చేశాడు. కథనం కొంత స్లోగా అనిపించినా, రెండవ భాగంలో ఉత్కంఠంగా మారుతుంది. భావోద్వేగాలు సినిమాను ఎలివేట్ చేస్తాయి.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. దేవిపై శేఖర్ కమ్ముల ముద్రపడింది. దేవి ఇచ్చే అవుట్ పుట్ కాకుండా దేవి నుంచి తనకు కావల్సినది డెలివరీ చేయించుకున్నాడు శేఖర్. “నా కొడుకా” వంటి పాటలు డీప్ గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని మరింత రక్తికట్టించింది.
సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్: నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ముంబై, హైదరాబాద్, మరియు తిరుపతిలోని రియల్ లొకేషన్స్‌ను అద్భుతంగా చిత్రీకరించింది . కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమా యొక్క 3 గంటల 1 నిమిషం రన్‌టైమ్‌ను సమర్థవంతంగా తీసుకొచ్చారు. అయితే మొదటి భాగంలో కొంత ట్రిమ్మింగ్ ఉంటే మరింత బాగుండేది.Kuberaa Movie Review In Telugu, Dhanush, Nagarjuna, Rashmikaబలాలు 👍👍
ధనుష్ మరియు నాగార్జున నటన.సామాజిక సమస్యను సామాన్యుడి ఎమోషన్ కోణంలో లోతుగా తీసుకెళ్లడం.దేవి శ్రీ ప్రసాద్ యొక్క సంగీతం మరియు నికేత్ బొమ్మిరెడ్డి విజువల్స్.శేఖర్ కమ్ముల రచన, కొత్త తరహా దర్శకత్వం.
బలహీనతలు 👎👎
మొదటి భాగంలో కథనం కొంత నెమ్మదిగా సాగడం.కొన్ని పాత్రలు, ముఖ్యంగా రష్మిక యొక్క పాత్ర పూర్తిగాగా వాడలేదు.కొన్ని సన్నివేశాలలో మీనింగ్ కన్వే కాదు. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది.Kubera Teaser Release Date Announced - Social News XYZ

తీర్పు 🔴🎞️🔴
కుబేర ఒక ఆలోచనలో పడేసైే ఎమోషనల్ కనెక్ట్ ఉన్న థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా. సామాజిక సమస్యలను క్రైమ్ థ్రిల్లర్ ఫ్రేమ్‌వర్క్‌లో అద్భుతంగా అల్లుకుంది. ధనుష్ మరియు నాగార్జున నటన, శేఖర్ కమ్ముల రచన, మరియు టెక్నికల్ బృందం యొక్క అద్భుతమైన పనితనం ఈ సినిమాను 2025లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిపాయి. స్లో-బర్న్ థ్రిల్లర్‌లు, లోతైన సందేశాలు, మరియు శక్తివంతమైన నటనను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం.Kubera: Release Date, Cast & Crew, Plot & More About Dhanush's Upcoming  Gritty Thriller | Kubera Dhanush movie | Kubera release date | Kubera cast  and crew | Kubera plot details |🟢 ప్రకాష్ చిమ్మల వర్డ్ 🟢 : థియేటర్‌లో చూడదగిన ఒక ఇంటెన్స్ గ్రిప్పింగ్ సినిమా. కమ్ముల దర్శకత్వంలో, దేవి మ్యాజిక్ ను, ధనుష్ విశ్వరూపాన్ని చూడాలనుకుంటే మంచి ఆప్షన్. ఇంటర్వెల్ గూస్‌బంప్స్ నుండి క్లైమాక్స్ చిల్స్ వరకు కుబేర లో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు.

Latest news