విడుదల తేదీ: జూన్ 27, 2025
తారాగణం: మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ఆర్. శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి, శివబాలాజీ, మధుబాల
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ఎడిటింగ్: ఆంథోనీ
కథ, కథనం: మంచు విష్ణు
దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్
నిర్మాత: మోహన్ బాబు
బ్యానర్స్: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
రేటింగ్: ★★★☆☆ (2.75/5)
కథ సారాంశం:
‘కన్నప్ప’ శ్రీ కాళహస్తీశ్వరుడి భక్తుడైన తిన్నడు (మంచు విష్ణు) జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం. దేవుడిపై నమ్మకం లేని తిన్నడు, తన గత జన్మ రహస్యాలు, శివుని ఆజ్ఞతో ఎలా భక్తుడిగా మారాడనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ యాత్రలో రుద్ర (ప్రభాస్), మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు), కిరాత (మోహన్ లాల్), శివుడు (అక్షయ్ కుమార్), పార్వతి (కాజల్ అగర్వాల్) పాత్రలు కథను ముందుకు తీసుకెళతాయి.
విశ్లేషణ:
పురాణ గాథలను తెరపైకి ఎక్కించేటపుడు ప్రేక్షకులను ఆ రకమైన మూడ్ లోకి తీసుకెళ్లాలి. సహజ పాత్రలతో గంభీరమైన వాతావరణాన్ని అనుభూతి చెందేలా తీయాలి. పౌరాణిక కాలంలోకి టైం ట్రావెల్ చేస్తున్నట్టు అనుభూతి కల్పించాలి. దీనికోసం పాత్రలు సహజంగా ఉండాలి. భాషలో జాగ్రత్తపడాలి. సెట్స్ ఇంకా కీలకం. 2వ శతాబ్దంలో శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన కథకు తగ్గట్లు మన దగ్గరే లొకేషన్ చూసుకుని సెట్స్ వేసుకోకుండా న్యూజిలాండ్ దేశానికి వెళ్లారు. పోతే పోయారు… దానికి కన్విన్సింగ్ కారణం గానీ.. సినిమాకు ఉపయోగం కానీ ఏమీ కన్పించలేదు. అప్పటి ప్రాంతంలో ఉన్నట్టు కాకుండా టూరిస్ట్ స్పాట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బ్యాగ్రౌండ్ వల్ల… మనం పౌరాణిక కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాం.పైగా 6 ప్యాక్ లు, హెయిర్ స్టైలింగ్, టాటూలు…. బలవంతంగా వెళ్దామన్నా 2వ శతాబ్దానికి మనల్ని వెళ్లనివ్వవు. సినిమాలో అన్ని పాత్రలో 2వ శతాబ్దంలో ఉంటే వాళ్ల మధ్య 20వ శతాబ్దం అమ్మాయి తిరుగుతోందా అన్నట్లు ఉంటుంది హీరోయిన్ని చూస్తే. తొలి సన్నివేశాల్లోనే చిన్నప్పటి తిన్నడిగా మంచు విష్ణు కొడుకు ఇంగ్లిష్ యాక్సెంట్లో తెలుగు డైలాగులు… మనం మంచు వాళ్ల సినిమా ను చూస్తున్న ఫీలింగ్ ను కలిగిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ‘కన్నప్ప’లో ఒక భక్తి రస చిత్రానికి అవసరమైన ఎమోషనల్ డెప్త్ ఏ మాత్రం లేదు.
‘కన్నప్ప’ సినిమాను మంచు విష్ణు కుటుంబం ఇంత పట్టుబట్టి.. ఇంత భారీ బడ్జెట్ పెట్టి.. ఎంతో నమ్మకంగా తెరకెక్కించడానికి ప్రధాన కారణం.. ఆ కథలో ఉన్న బలం. కన్నప్ప అసలు పేరు.. తిన్నడు. మరి ఆ తిన్నడు కన్నప్ప ఎందుకు అయ్యాడు అన్నదే ఈ కథ ప్రత్యేకత. పరమ భక్తుడిగా మారడంలో ఉన్న నాటకీయత ప్రెజెంట్ చేయడంలో మంచు విష్ణు పూర్తిగా సఫలం కాలేదు. వృథా కామెడీ, వృథా సీన్లు గంటన్నర నిడివిలో ‘వావ్’ అనిపించే ఎపిసోడ్లు కరవవడం ఈసినిమాను దెబ్బ తీశాయి. అసలు ప్రథమార్ధంలో కథే ముందుకు కదలదు. సినిమా సెకండాఫ్ లో మెల్లగా పుంజుకుంటుంది. ప్రభాస్ పోషించిన రుద్ర పాత్ర వచ్చాక అటు కథలో.. ఇటు ప్రేక్షకుల్లో చలనం వస్తుంది.
ప్లస్ పాయింట్స్:
క్లైమాక్స్ మరియు సెకండ్ హాఫ్: సినిమా చివరి 40 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్, భావోద్వేగంతో, శివ భక్తితో నిండి ఉంటాయి. మంచు విష్ణు ఒకే టేక్‌లో చేసిన ఎమోషనల్ మోనోలాగ్, ప్రభాస్ రుద్ర పాత్రలో ఎంట్రీ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సోషల్ మీడియాలో రోహిత్ జైస్వాల్, సుమిత్ కడెల్ వంటి విశ్లేషకులు క్లైమాక్స్‌ను “స్పెక్టాక్యులర్” అని, శివ భక్తులకు ఆకర్షణీయంగా ఉందని ప్రశంసించారు.
నటీనటుల పనితీరు: మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో పర్వాలేదు అనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో. ప్రభాస్ రుద్ర పాత్రలో సినిమాకు గొప్ప బలాన్ని జోడించాడు, అతని శాంతమైన, ఆధ్యాత్మిక హావభావం ఆకట్టుకుంది. మోహన్ బాబు పాత్ర బాగుంది. మోహన్ లాల్, శరత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కామియోలు ఓకే ఓకే.
విజువల్స్ మరియు సంగీతం: న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన దృశ్యాలు, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు విజువల్, ఆడియో ట్రీట్‌గా నిలుస్తాయి. కానీ సినిమాను సింక్ చేయలేదు.
భక్తి రసం: శివ భక్తులకు సినిమా భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా కన్నప్ప శివునికి కళ్లను అర్పించే సన్నివేశం, గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్: సినిమా మొదటి భాగం నెమ్మదిగా, సంఘర్షణ లేకుండా సాగుతుంది. కథనం బలంగా లేకపోవడం వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షించలేకపోయింది. వీక్ స్క్రీన్ ప్లే.
స్థానికత లోపం: న్యూజిలాండ్‌లో చిత్రీకరణ వల్ల స్థానికత (నేటివిటీ) కోల్పోయింది. భక్తి రస చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు అనవసరంగా అనిపించాయి. అక్షయ్ కుమార్ డబ్బింగ్ మరియు కాస్టింగ్: అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో సరిగ్గా సెట్ కాలేదనే చెప్పాలి. డబ్బింగ్ యావరేజ్. ఈ అంశం సినిమా యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణను కొంత దెబ్బతీసింది. పేసింగ్ మరియు ఎడిటింగ్: సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివి అనవసరం. యుద్ధ సన్నివేశాలు, కొన్ని ఉపకథలు అంతగా ఆకర్షించలేదు. ఎడిటింగ్ గట్టిగా ఉంటే బాగుండేదని విమర్శలు ఉన్నాయి.
అండర్‌డెవలప్డ్ పాత్రలు: మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి నటుల పాత్రలు చిన్నవిగా ఉండటం, పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం నిరాశపరిచింది.సోషల్ మీడియా స్పందన:
సినిమాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు క్లైమాక్స్‌ను, మంచు విష్ణు, ప్రభాస్ పాత్రలను ప్రశంసిస్తూ మంచి రేటింగ్ ఇచ్చారు. మంచు మనోజ్ సినిమాను “వెయ్యి రెట్లు బాగుంది” అని పొగిడారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను హైలైట్ చేశారు. కొందరు నేటివిటీ లోపం, అక్షయ్ కుమార్ డబ్బింగ్, రొమాన్స్ సన్నివేశాలపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ “డెడ్ వైబ్స్”తో సాగిందని, సెకండ్ హాఫ్‌లోనే ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు.సాంకేతిక అంశాలు:
షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, న్యూజిలాండ్ లొకేషన్స్ సినిమాకు గొప్ప విజువల్ అనుభవాన్ని అందించాయి. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం భక్తి రసాన్ని ఉధృతం చేసింది. అయితే, VFX కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎడిటింగ్‌లో లోపాలు సినిమా ప్రభావాన్ని కొంత తగ్గించాయి.
మొత్తం మీద:
‘కన్నప్ప’ ఒక భక్తి రసాత్మక కథను భారీ స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంలో విజయవంతమైంది, కానీ కథనంలో స్థిరత్వం లేకపోవడం, నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, నేటివిటీ లోపం వంటి అంశాలు సినిమాను యావరేజ్‌గా నిలిపాయి. అయితే క్లైమాక్స్, ప్రభాస్ రుద్ర పాత్ర, మంచు విష్ణు నటన శివ భక్తులను, సినీ ప్రేమికులను ఆకర్షిస్తాయి.తీర్పు:
‘కన్నప్ప’ శివ భక్తులకు, భక్తి రస చిత్రాలను ఇష్టపడే వారికి ఒక మంచి అనుభవం. అయితే, కథనంలో వేగం లేకపోవడం, పౌరాణికతను వంద శాతం స్రుజించలేకపోయారు.
ప్రకాష్ చిమ్మల వర్డ్ : గొప్ప పౌరాణిక అనుభూతిని ఊహించకుండా, అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా నచ్చే అవకాశం ఉంది.