Movies' అఖండ 2 ' టీజ‌ర్‌... లాజిక్‌ను ఎగ‌రేసి త‌న్నిన బాల‌య్య...

‘ అఖండ 2 ‘ టీజ‌ర్‌… లాజిక్‌ను ఎగ‌రేసి త‌న్నిన బాల‌య్య – బోయ‌పాటి…!

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణతో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న మాస్ దర్శకుల్లో ఒకప్పుడు బి గోపాల్ ఉంటే ఈ తరంలో మాత్రం బోయపాటి శ్రీను మాత్రమే ఉంటారు. వీరి కాంబోలో వ‌చ్చిన సింహా – లెజెండ్ – అఖండ మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వ‌స్తోన్న నాలుగో సినిమా అఖండ 2 – తాండ‌వం సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Akhanda 2 teaser: Nandamuri Balakrishna's 'cringe' scenes leaves internet  divided: 'Even Bhojpuri cinema is ashamed' | Mint

తాజాగా బాల‌య్య పుట్టిన రోజు కానుక‌గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇపుడు చర్చగా మారింది. మామూలుగానే బోయపాటి అంటేనే మాస్ .. ఊర‌మాస్. బోయ‌పాటి సినిమాల‌లో లాజిక్స్ వెత‌క‌కుండా జ‌స్ట్ మాస్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అఖండ 2 విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌బోతోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

Akhanda 2: Thandavam teaser out: Nandamuri Balakrishna film to hit cinemas  around Dussehra - CNBC TV18

తాజాగా వ‌చ్చిన అఖండ 2 తాండ‌వం టీజర్ లో ఒకటీ రెండు షాట్స్ మీద కూడా బోయ‌పాటి లాజిక్ మిస్ అయినా షాట్స్ మాస్ తాండ‌వం చేసేశాయంటున్నారు. ఓవ‌రాల్‌గా ఆడియెన్స్ సోష‌ల్ మీడియాలో లాజిక్స్ మిస్ అయినా కూడా టీజ‌ర్ అదిరిపోయింద‌నే అంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు.

Latest news