నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందులో మొదటి సీక్వెల్ కావడంతో దీనిపై క్రేజీ హైప్ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో కొనసాగుతూ ఉండగా సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాతలు దసరాకి లాక్ చేశారు. ఈ రేసులో అఖండ 2 రాకపోవచ్చు అనే టాపిక్ కూడా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.అయితే అసలైన క్లారిటీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. జూన్లో బాలయ్య పుట్టినరోజు ఉంది. ఆ రోజు టీజర్ రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఇందులో పాత తేదీనా లేదా కొత్త తేదీనా అన్నది మాత్రం చేస్తారని అంటున్నారు. సో అఖండ 2 రిలీజ్ డేట్ క్లారిటీ రావాలి అంటే టీజర్ లో తేలిపోతుంది.
‘ అఖండ 2 ‘ రిలీజ్ డేట్పై ముహూర్తం పెట్టేశారుగా…. ఆ రోజే క్లారిటీ…!
